STOCKS

News


నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Tuesday 11th September 2018
Markets_main1536636708.png-20136

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:53 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 13 పాయింట్ల నష్టంతో 11,473 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో సోమవారం నాటి ముగింపు 11,492 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు జపాన్‌ ఇండెక్స్‌ మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి.  

ఆసియా మార్కెట్లు నష్టాల్లో..
ఒక్క జపాన్‌ ఇండెక్స్‌ మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 222 పాయింట్ల లాభంతో 22,595 పాయింట్ల వద్ద ఉంది. ఇక దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 7 పాయింట్ల నష్టంతో 2,282 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 43 పాయింట్ల నష్టంతో 26,570 పాయింట్ల వద్ద,  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 12 పాయింట్ల నష్టంతో 3,109 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 8 పాయింట్ల నష్టంతో 2,661 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 33 పాయిం‍ట్ల నష్టంతో 10,692 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   

మిశ్రమంగా అమెరికా మార్కెట్లు..
అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగానే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 59 పాయిం‍ట్ల నష్టంతో 25,857 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500 కేవలం 5 పాయింట్ల లాభంతో 2,877 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 22 పాయింట్ల లాభంతో 7,924 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. యాపిల్‌ స్టాక్‌ క్షీణత వల్ల నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ లాభాలు తగ్గాయి. 



You may be interested

మార్కెట్‌ పడుతుందా? పెరుగుతుందా?

Tuesday 11th September 2018

సోమవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన నిఫ్టీ తర్వాత అదే నష్టాలను కొనసాగించింది. 11,500 మార్క్‌కు దిగువకు వచ్చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్టానికి పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ మొదలుకావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఇండెక్స్‌ తన డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్‌లో బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ ప్యాట్రన్‌ ఏర్పరచింది.  పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,385,

ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి: నిపుణులు

Tuesday 11th September 2018

రూపాయి ఒకే రోజు 72 పైసలు పతనం కావడం, ఫలితంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం కుప్పకూలడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసేదే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.    11,200 దిశగా నిఫ్టీ... ‘‘నిఫ్టీ ఆరు నెలల్లోనే ఒకే రోజు 1.3 శాతం పతనమైంది. మార్కెట్‌లో లాభపడిన వాటి కంటే నష్టపోయిన షేర్లే ఎక్కువ ఉన్నాయి. స్వల్ప కాల డౌన్‌ ట్రెండ్‌లోకి మార్కెట్‌ ప్రవేశించింది. ఈ పతనం తదుపరి మద్దతు

Most from this category