STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Friday 19th October 2018
Markets_main1539920089.png-21278

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:43 సమయంలో 52 పాయింట్ల నష్టంతో 10,330 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,443 పాయింట్లతో పోలిస్తే 113 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ శుక్రవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు గురువారం భారీగానే పతనమయ్యాయి.   

ఆసియా మార్కెట్లు నష్టాల్లో..
అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఒక్క చైనా మినహా మిగతా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 246 పాయింట్ల నష్టంతో 22,411 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 5 పాయింట్ల నష్టంతో 3,064 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 54 పాయిం‍ట్ల నష్టంతో 9,899 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 10 పాయింట్ల లాభంతో 2,496 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 8 పాయింట్ల నష్టంతో 2,140 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 56 పాయింట్ల నష్టంతో 25,398 పాయింట్ల వద్ద ఉన్నాయి.  

అమెరికా మార్కెట్‌ పతనం..
ఇటలీ బడ్జెట్‌, అమెరికా- సౌదీ అరేబియా మధ్య సంబంధాలు దెబ్బతినొచ్చని యూరోపియన్‌ కమిషన్‌ గురువారం హెచ్చరించింది. ఇప్పటికే వడ్డీ రేట్ల పెంపు, అమెరికా- చైనా వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు ఇప్పుడు యూరోపియన్‌ కమిషన్‌ తాజా హెచ్చరికతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్ర ప్రతికూల పడింది. దీంతో అమెరికా మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా పడిపోయాయి. నాస్‌డాక్‌ అయితే 2 శాతానికిపైగా క్షీణించింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.27 శాతం లేదా 327 పాయిం‍ట్ల నష్టంతో 25,379 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.44 శాతం లేదా 40 పాయింట్ల నష్టంతో 2,768 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.06 శాతం లేదా 157 పాయింట్ల నష్టంతో 7,485 పాయింట్ల వద్ద ముగిసింది.



You may be interested

మార్కెట్‌ ఎటు?

Friday 19th October 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఇటలీ బడ్జెట్‌, అమెరికా- సౌదీ అరేబియా మధ్య సంబంధాలు దెబ్బతినొచ్చని యూరోపియన్‌ కమిషన్‌ గురువారం హెచ్చరించింది. ఇప్పటికే వడ్డీ రేట్ల పెంపు, అమెరికా- చైనా వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు ఇప్పుడు యూరోపియన్‌ కమిషన్‌ తాజా హెచ్చరికతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్ర ప్రతికూల పడింది. దీంతో అమెరికా మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా పడిపోయాయి. నాస్‌డాక్‌ అయితే 2 శాతానికిపైగా క్షీణించింది.

హీరో మోటోకార్ప్‌ కొనొచ్చు

Thursday 18th October 2018

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సు కొత్త లాంచ్‌లు హీరోమోటోకార్‌‍్పకు మరింత కలిసివస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. దీర్ఘకాల ధృక్పథంతో హీరోమోటో షేరును కొనొచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ రూ. 3602. క్యు2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది. క్యు2 విశేషాలు.. - బలమైన వాల్యూ వృద్ధితో దేశీయ ద్విచక్రవాహన (మోటర్‌సైకిల్‌)మార్కెట్లో 50.8 శాతం వాటాతో అగ్రస్థానం నిలబెట్టుకుంది. అయితే స్కూటర్‌ మార్కెట్లో వాటా 168 బీపీఎస్‌ మేర తగ్గింది. 125సీసీ స్కూటర్ల విభాగంలో

Most from this category