STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు

Tuesday 25th September 2018
Markets_main1537845816.png-20532

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:41 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 11 పాయింట్ల నష్టంతో 10,981 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,997 పాయింట్లతో పోలిస్తే 16 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. 

ఆసియా సూచీలు లాభాల్లో..
ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా, హాంగ్‌ కాంగ్‌ మార్కెట్లకు సెలవు. జపాన్‌ నికాయ్‌ 225.. 40 పాయింట్ల లాభంతో 23,909 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 28 పాయిం‍ట్ల లాభంతో 11,000 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 12 పాయింట్ల లాభంతో 3,231 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 19 పాయింట్ల నష్టంతో 2,778 పాయింట్ల వద్ద ఉంది. ఇక హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ సోమవారం ఏకంగా 454 పాయింట్ల నష్టంతో 27,499 పాయింట్ల వద్ద ముగిసింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి శుక్రవారం 16 పాయింట్ల లాభంతో 2,339 పాయింట్ల వద్ద క్లోజయింది.  

మిశ్రమంగా అమెరికా మార్కెట్లు..
అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 181 పాయిం‍ట్ల నష్టంతో 26,562 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 10 పాయింట్లు నష్టంతో 2,919 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 6 పాయింట్ల లాభంతో 7,993 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా-చైనా కొత్త టారిఫ్‌లు సోమవారం నుంచి అమల్లోకి రావడం ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే ఫెడ్‌ మరోదఫా వడ్డీ రేట్లు పెంచుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 



You may be interested

మార్కెట్‌పై వీటి ప్రభావం...

Tuesday 25th September 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 181 పాయిం‍ట్ల నష్టంతో 26,562 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 10 పాయింట్లు నష్టంతో 2,919 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 6 పాయింట్ల లాభంతో 7,993 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా-చైనా కొత్త టారిఫ్‌లు సోమవారం నుంచి అమల్లోకి రావడం ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే

వాట్సప్‌ ద్వారా క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌

Monday 24th September 2018

ఔను.. మీరు చదివింది నిజమే. ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ ద్వారా ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. ప్రైవేట్‌ రంగ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ‘భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌’ తాజాగా ఇటువంటి సేవలను ప్రారంభించింది. దేశీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పరిశ్రమలో ఈ తరహా సేవలను ప్రారంభించిన తొలి సంస్థగా భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నిలిచింది. క్లెయిమ్‌ ప్రాసెస్‌ ఇలా.. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు నామినీ తన వాట్సప్‌ ద్వారా భారతీ

Most from this category