STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 100 పాయింట్లు పతనం

Thursday 6th December 2018
Markets_main1544067247.png-22674

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:51 సమయంలో 105 పాయింట్ల నష్టంతో 10,728 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,827 పాయింట్లతో పోలిస్తే 100 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లకు బుధవారం సెలవు. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 3.1 శాతం లేదా 799 పాయిం‍ట్ల నష్టంతో 25,027 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 3.24 శాతం లేదా 90 పాయింట్ల నష్టంతో 2,700 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 3.8 శాతం లేదా 283 పాయింట్ల నష్టంతో 7,158 పాయింట్ల వద్ద ముగిసింది. 

కుప్పకూలిన ఆసియా మార్కెట్లు.. 
అమెరికా మార్కెట్ల పతనం నేపథ్యంలో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 40 పాయింట్ల నష్టంతో 3,115 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 192 పాయింట్ల నష్టంతో 9,724 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 28 పాయింట్ల నష్టంతో 2,622 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 26 పాయింట్ల నష్టంతో 2,075 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 736 పాయింట్ల నష్టంతో 26,082 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 404 పాయింట్ల నష్టంతో 21,514 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. కొస్పి, షాంఘై ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా.. నికాయ్‌, తైవాన్‌, హాంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌లు రెండు శాతానికి పైగా పడిపోయాయి. 

 
 



You may be interested

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Thursday 6th December 2018

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:51 సమయంలో 105 పాయింట్ల నష్టంతో 10,728 పాయింట్ల వద్ద ఉంది.  ♦ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చే ఏడాది ఆయిల్‌ ఉత్పత్తిని తగ్గించొద్దని ఒపెక్‌ దేశాలను కోరారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ ధరలు బాగా పెరగొచ్చని తెలిపారు. కాగా ఒపెక్‌ దేశాలు డిసెంబర్‌

కొంటే ఈ నెల్లోనే...! జనవరిలో ధరలు భారీగా పెంపు

Wednesday 5th December 2018

వచ్చే వేసవిలో చల్లదనం కోసం ఏసీ కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉందా...? అయితే, కాస్త ముందుగా, ఈ నెలలోనే కొనుగోలు చేసుకుంటే ఆర్థికంగా కలిసొస్తుంది. ఎందుకంటే కంపెనీలు 10 శాతం వరకు ధరల పెంపును జనవరి నుంచి అమలు చేయబోతున్నాయి. ధరల పెంపు ఒక్క ఏసీలకే కాదు... టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు వంటి వైట్‌గూడ్స్‌ అన్నింటి ధరలు పెరగబోతున్నాయి. వీటి ధరలు 7-10 శాతం మధ్యలో పెరుగుతాయని, ఏసీలలపై

Most from this category