STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు

Tuesday 2nd October 2018
Markets_main1538454563.png-20785

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 10 పాయింట్ల నష్టంతో 11,053 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 11,061 పాయింట్లతో పోలిస్తే 8 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ రోజంతా ఇదే ట్రెండ్‌లో ఉండి.. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. 
కాగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లను మంగళవారం గాంధీ జయంతి కారణంగా సెలవు. ఆర్‌బీఐ ఈ నెలలో ఓపెన్‌ మార్కెట్‌ నుంచి  రూ.36,000 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయనుండటం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను ప్రభుత్వం టేకోవర్‌ చేయనుండడం,  సానుకూల అంతర్జాతీయ సంకేతాల వల్ల సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. ముడి చమురు ధరలు దిగిరావడం, తయారీ రంగ పీఎంఐ గణాంకాలు సానుకూలంగా ఉండటం వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పుంజుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 299 పాయింట్లు పెరిగి 36,526 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 11,008 పాయింట్ల వద్ద ముగిశాయి. 



You may be interested

స్వల్పంగా కోలుకున్న పసిడి

Tuesday 2nd October 2018

గతరాత్రి అమెరికా మార్కెట్లో 6-వారాల కనిష్టానికి పతనమైన పసిడి ధర బుధవారం ఆసియా మార్కెట్లో  కోలుకుంది. డాలర్‌ స్థిరమైన ర్యాలీ అందుకు కారణమవుతోంది. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 3.60 డాలర్లు లాభపడి 1,195.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి నెలరోజ గరిష్టాన్ని(95.37) తాకిన డాలర్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 94.94 స్థాయిని వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నాఫ్టా(నార్త్‌ అమెరికన్‌

అమెరికా మార్కెట్లు శుభారంభం

Tuesday 2nd October 2018

అమెరికా మార్కెట్లు నాల్గవ త్రైమాసికానికి శభారంభాన్ని ఇచ్చాయి. నాస్‌డాక్‌ మినహా మిగతా రెండు ప్రధాన ఇండెక్స్‌లు సోమవారం లాభాల్లోనే ముగిశాయి. అమెరికా, కెనడా ట్రేడ్‌ డీల్‌ సానుకూల ప్రభావం చూపింది. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ స్వల్పంగా నష్టపోతే.. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 192 పాయిం‍ట్ల లాభంతో 26,651 పాయింట్ల వద్ద ముగిసింది. చెవ్రాన్‌, బోయింగ్‌ ఔట్‌పర్ఫార్మ్‌ చేశాయి. ఇక ఎనర్జీ, మెటీరియల్స్‌, ఇండస్ట్రీయల్‌ షేర్లు

Most from this category