STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Monday 5th November 2018
Markets_main1541388640.png-21691

అమెరికా మధ్యంతర ఎన్నికలు, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:50 సమయంలో 57 పాయింట్ల నష్టంతో 10,531 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,577 పాయింట్లతో పోలిస్తే 46 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టపోయాయి. 

నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. 
అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. అయితే జపాన్‌ నికాయ్‌ 225 మార్కెట్‌కు సోమవారం సెలవు. ఇది శుక్రవారం 258 పాయింట్ల నష్టంతో 21,985 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సోమవారం రోజు.. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 47 పాయింట్ల నష్టంతో 3,068 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 84 పాయిం‍ట్ల నష్టంతో 9,822 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 19 పాయింట్ల నష్టంతో 2,657 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 34 పాయింట్ల నష్టంతో 2,061 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 603 పాయింట్ల నష్టంతో 25,882 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   

అమెరికా మార్కెట్లు డౌన్‌..
అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.43 శాతం లేదా 110 పాయిం‍ట్ల నష్టంతో 25,270 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.63 శాతం లేదా 17 పాయింట్ల నష్టంతో 2,723 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 1.04 శాతం లేదా 77 పాయింట్ల నష్టంతో 7,356 పాయింట్ల వద్ద ముగిసింది. యాపిల్‌ మార్కెట్‌క్యాప్‌ 1 ట్రిలియన్‌ డాలర్ల కిందకు పడిపోవడంతో షేరు 6.6 శాతం క్షీణించింది. దీంతోపాటు కంపెనీ ఈ క్వార్టర్‌లో అమ్మకాలు అంచనాలను అందుకోలేపోవచ్చని పేర్కొనడం నెగటివ్‌ ప్రభావం చూపింది.



You may be interested

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Monday 5th November 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.43 శాతం లేదా 110 పాయిం‍ట్ల నష్టంతో 25,270 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.63 శాతం లేదా 17 పాయింట్ల నష్టంతో 2,723 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 1.04 శాతం లేదా 77 పాయింట్ల నష్టంతో 7,356 పాయింట్ల వద్ద ముగిసింది. యాపిల్‌ మార్కెట్‌క్యాప్‌

మారికో కొనొచ్చు- హెచ్‌డీఎఫ్‌సీ

Saturday 3rd November 2018

కంపెనీ: మారికో లిమిటెడ్‌ సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.337 (నవంబర్‌ 3, 2018న) టార్గెట్‌ ధర: రూ.380 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.388 /283 మారికో లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక(క్యూ2) ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో

Most from this category