STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు..

Saturday 20th October 2018
Markets_main1540019018.png-21318

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 52 పాయింట్ల నష్టంతో 10,273 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,303 పాయింట్లతో పోలిస్తే 30 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం మిశ్రమంగానే క్లోజయ్యాయి.  
లిక్విడిటీ భయాలు మళ్లీ తలెత్తడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. దసరా (గురువారం) సెలవు కారణంగా ఒక్క రోజు విరామం తర్వాత ఆరంభమైన స్టాక్‌ సూచీలు చెరో ఒక శాతానికి పైగా క్షీణించాయి. ఫెడ్‌ రేట్ల పెంపు భయాలు, చైనా వృద్ధి మందగించడం వంటి కారణాల వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. దీనికి తోడు  వీసా నిబంధనలు మరింత కఠినతరం కానుండటం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌  ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ షేర్లు 4 శాతం వరకూ నష్టపోవడం  వంటి ప్రతికూలాంశాల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు సంబంధించిన లిక్విడిటీ కవరేజ్‌ రేషియో నిబంధనలను ఆర్‌బీఐ సరళీకరించినా, ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ఇంట్రాడేలో నిఫ్టీ కీలకమైన 10,250 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 464 పాయింట్లు క్షీణించి 34,316 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 10,304 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ 418 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్లు చొప్పున క్షీణించాయి.



You may be interested

వేదాంత ఏడీఆర్‌ 4% అప్‌..

Saturday 20th October 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ అన్నీ కూడా శుక్రవారం దాదాపుగా లాభాల్లోనే ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగింది. దీని తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్‌ బాగా లాభపడింది.  టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.42 శాతం వృద్ధితో 11.89 డాలర్లకు పెరిగింది.

చైనా మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌..

Saturday 20th October 2018

శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన చైనా మార్కెట్ చివరకు లాభాల్లో ముగిసింది. 2.58 శాతం లేదా 64 పాయింట్ల పెరుగుదలతో 2,550 పాయింట్లకు బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. చైనా ఆర్థిక వృద్ధి తొమిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని గణాంకాలు పేర్కొనడంతో మార్కెట్లు పడిపోయాయి. అయితే చైనా టాప్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్లు.. చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై, స్టాక్‌ మార్కెట్‌పై విశ్వాసంతో ఉన్నామని పేర్కొనడం సానుకూల ప్రభావం చూపింది. కాగా చైనా స్టాక్‌

Most from this category