STOCKS

News


నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Tuesday 23rd October 2018
Markets_main1540265722.png-21370

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం భారీ నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:46 సమయంలో ఏకంగా 111 పాయింట్ల నష్టంతో 10,141 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,231 పాయింట్లతో పోలిస్తే 90 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ మంగళవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగానే ముగిశాయి. 

ఆసియా మార్కెట్లు డౌన్‌.. 
అమెరికా మార్కెట్ల ప్రభావం, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. నికాయ్‌, హాంగ్‌సెంగ్‌, కొస్పి ఇండెక్స్లు 2 శాతానికిపైగా పతనమయ్యాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 494 పాయింట్ల నష్టంతో 22,120 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 27 పాయింట్ల నష్టంతో 3,051 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 137 పాయిం‍ట్ల నష్టంతో 9,837 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 24 పాయింట్ల నష్టంతో 2,631 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 46 పాయింట్ల నష్టంతో 2,115 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 482 పాయింట్ల నష్టంతో 25,670 పాయింట్ల వద్ద ఉన్నాయి.  

మిశ్రమంగా అమెరికా మార్కెట్‌..
అమెరికా మార్కెట్‌ సోమవారం దాదాపుగా నష్టాల్లోనే ముగిసింది. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లు నష్టాల్లో ముగిస్తే.. మిగిలిన నాస్‌డాక్‌ ఇండెక్స్‌ లాభాల్లో ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.5 శాతం లేదా 126 పాయిం‍ట్ల నష్టంతో 25,317 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.43 శాతం లేదా 11 పాయింటు నష్టంతో 2,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.26 శాతం లేదా 20 పాయింట్ల లాభంతో 7,468 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్నాలజీ స్టాక్స్‌ లాభపడటంతో ఎస్‌అండ్‌పీ 500 నష్టాలు తగ్గాయి. అదేసమయంలో నాస్‌డాక్‌ పెరిగింది. అయితే ఫైనాన్షియల్‌ (మరీ ముఖ్యంగా పెద్ద బ్యాంకుల షేర్లు నష్టపోవడం), ఎనర్జీ స్టాక్స్‌ నష్టపోవడం వల్ల డౌజోన్స్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే ఈ వారంలో వెలువడనున్న కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌పై ఆందోళనలు నెలకొన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బ్రెగ్జిట్‌ ఇష్యూ, ఇటలీ బడ్జెట్‌, సౌదీ అరేబియా సంబంధిత అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. 



You may be interested

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Tuesday 23rd October 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్‌ సోమవారం దాదాపుగా నష్టాల్లోనే ముగిసింది. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు నష్టాల్లో ముగిస్తే.. మిగిలిన నాస్‌డాక్‌ ఇండెక్స్‌ లాభాల్లో ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.5 శాతం లేదా 126 పాయిం‍ట్ల నష్టంతో 25,317 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.43 శాతం లేదా 11 పాయింటు నష్టంతో 2,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌

పలు నోకియా ఫోన్లపై భారీగా ధరల తగ్గింపు

Monday 22nd October 2018

నోకియా బ్రాండ్‌పై స్మార్ట్‌ఫోన్లను విక్రయించే హెచ్‌ఎండీ గ్లోబల్‌ పలు మోడళ్లపై ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మార్కెట్లో ధరల పరంగా విపరీతమైన పోటీ నెలకొనడం, చైనాకు చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరలకు ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో నోకియా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  నోకియా 3.1 నోకియా 3.1 స్మార్ట్‌ఫోన్‌ను మూడు నెలల క్రితం హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసింది. 3జీబీ/32జీబీ వెర్షన్‌ ధరను మొదట్లో రూ.11,999గా నిర్ణయించింది. తాజాగా ఈ

Most from this category