STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Thursday 25th October 2018
Markets_main1540438160.png-21453

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:31 సమయంలో ఏకంగా 101 పాయింట్ల నష్టంతో 10,136 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,228 పాయింట్లతో పోలిస్తే 92 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. 

నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. 
అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 618 పాయింట్ల నష్టంతో 21,472 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 33 పాయింట్ల నష్టంతో 2,999 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 196 పాయిం‍ట్ల నష్టంతో 9,563 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 38 పాయింట్ల నష్టంతో 2,565 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 49 పాయింట్ల నష్టంతో 2,048 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 444 పాయింట్ల నష్టంతో 24,805 పాయింట్ల వద్ద ఉన్నాయి.  

అమెరికా మార్కెట్లు క్రాష్‌..
అమెరికా మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఏడాది లాభాలన్నీ ఆవిరయ్యాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.41 శాతం లేదా ఏకంగా 608 పాయిం‍ట్ల నష్టంతో 24,583 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 3.09 శాతం లేదా 85 పాయింట్ల నష్టంతో 2,656 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4.43 శాతం లేదా 329 పాయింట్ల నష్టంతో 7,108 పాయింట్ల వద్ద ముగిసింది. గృహ విక్రయాలు బలహీనంగా ఉండటం, చిప్‌ తయారీ కంపెనీల భవిష్యత్‌ వృద్ధి అంచనాలు నిరుత్సాహకరంగా ఉండటం వల్ల ఆర్థిక వృద్ధి, ప్రాఫిట్‌ పెరుగుదలపై ఆందోళలు ఏర్పడ్డాయి. దీంతో మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. సెప్టెంబర్‌లో కొత్త గృహ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన చూస్తే దాదాపు 20 శాతంమేర క్షీణించాయి. గృహ నిర్మాణాలకు సంబంధించిన స్టాక్స్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు 35 శాతంమేర పతనమయ్యాయి. గృహ విక్రయాలు తగ్గడమనేది కన్సూమర్లకు నెగటివ్‌ సంకేతం లాంటిది. అందువల్ల నెట్‌ఫ్లిక్స్‌ దాదాపు 7 శాతంమేర పడిపోయింది. ఎస్‌అండ్‌పీ 100లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన స్టాక్‌. దీని తర్వాత ఏటీఅండ్‌టీ ఎక్కువగా నష్టపోయింది. 
బడ్జెట్‌ అంశమై ఇటలీ, యూరోపియన్‌ యూనియన్‌ మధ్య వివాదం నడుస్తుండటం, జర్నలిస్ట్‌ హత్య ఉదంతంపై సౌదీ అరేబియాపై విమర్శలు, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపొచ్చనే అంచనాలు, ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందనే భయాలు, చైనా ఆర్థిక వృద్ధి మందగించడం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. 



You may be interested

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Thursday 25th October 2018

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ♦ అమెరికా మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఏడాది లాభాలన్నీ ఆవిరయ్యాయి. 2011 నుంచి చూస్తే మార్కెట్లు ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే ప్రథమం. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.41 శాతం లేదా ఏకంగా 608 పాయిం‍ట్ల నష్టంతో 24,583 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 3.09 శాతం లేదా 85 పాయింట్ల నష్టంతో 2,656 పాయింట్ల

హౌసింగ్‌, కన్జూమర్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు దూరం!

Wednesday 24th October 2018

దేశీయ మార్కెట్లో ఇప్పటివరకు దుమ్మురేపిన కొన్ని రంగాలు ఇకపై చతికిలపడతాయని, ఇదే సమయంలో ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉన్న రంగాలు జోరు పెంచుతాయని యూటీఐ ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ లలిత్‌ నంబియార్‌ అభిప్రాయపడ్డారు. హౌసింగ్‌, కన్జూమర్‌ ఫైనాన్స్‌ రంగాలు ఇకపై అంతంతమాత్రంగా ఉంటాయని, ఫార్మా రంగంలో దూకుడు కనిపించవచ్చని అంచనా వేశారు. మూలాలపై బలమైన నమ్మకం ఉన్న కంపెనీలను ఎంచుకున్నవాళ్లు కరెక‌్షన్‌కు భయపడాల్సిన పనిలేదన్నారు. కంపెనీలు చేసే వ్యాపార నాణ్యతపై విశ్వాసం,

Most from this category