STOCKS

News


నష్టంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 9th February 2019
Markets_main1549706895.png-24110

సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి 10,927.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10957.25 పాయింట్లతో పోలిస్తే 20పాయింట్ల నష్టంతో ఉంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ నష్టంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ నెగిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక మనమార్కెట్‌ విషయానికొస్తే ...ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలకు తోడు, దేశీయ మార్కెట్లలో లాభాల స్వీకరణ కారణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. నిఫ్టీ మళ్లీ 11,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 490 పాయింట్లకు పతనమైన సెన్సెక్స్‌ చివరకు 425 పాయింట్ల క్షీణతతో 36,546 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 126 పాయింట్ల నష్టంతో 10,944 పాయింట్ల వద్ద ముగిశాయి.  
టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 8శాతం డౌన్‌..!
అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌ కంపెనీల ఏడీఆర్‌లు (అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్స్‌) గత రాత్రి నష్టాలతో ముగిశాయి. విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటామోటర్స్‌ షేర్లు 8శాతం వరకు నష్టపోయాయి. జాగ్వర్‌ అనిశ్చితి కారణంగా దేశీయ మార్కెట్లో 18శాతం నష్టపోయిన టాటామోటర్స్‌ కంపెనీ షేరు శుక్రవారం రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో 8శాతం నష్టపోయి 10.51డాలర్ల వద్ద స్థిరపడింది. డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీ ఏడీఆర్‌ 2శాతం క్షీణించి 38.80 డాలర్ల వద్ద, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.50శాతం పతనమై 9.79శాతం వద్ద స్థిరపడ్డాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ అరశాతం నష్టపోయి 100.29 డాలర్ల వద్ద ముగియగా, విప్రో ఏడీఆర్‌ మాత్రం ఎలాంటి లాభ, నష్టాలకు లోనుకాకుండా 5.66శాతం వద్ద స్థిరపడింది.



You may be interested

ఇంటి రుణాలపై ఎస్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు

Saturday 9th February 2019

ఆర్‌బీఐ రేట్‌ కట్‌ ప్రకటించిన అనంతరం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ తగ్గింపును కస్టమర్లకు చేరవేసే దిశగా నిర్ణయం తీసుకుంది. 30 లక్షల రూపాయల వరకు తీసుకున్న గృహరుణాలపై వడ్డీరేటును ఐదు బీపీఎస్‌ మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ‘ప్రస్తుత హోమ్‌లోన్‌ మార్కెట్‌లో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉంది. కస్టమర్లకు, ముఖ్యంగా మధ్యతరగతికి ప్రయోజనం కలిగేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యల ఫలితాలు  కస్టమర్లకు చేరవేసేందుకు యత్నిస్తున్నాం.’అని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు.

పార్లమెంట్‌లో బిజెనెస్‌

Saturday 9th February 2019

విదేశీ కార్యకలాపాల కుదింపు దిశగా బ్యాంకులు విదేశాల్లో తమ బిజినెస్‌ కార్యకలాపాల కుదింపునకు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి గుర్తించిన కార్యకలాపాల సంఖ్య జనవరి 15 నాటికి 54గా ఉంది.  ఇందులో 29 కార్యకలాపాలు కేవలం వ్యయ నియంత్రణలో భాగంగా నిలిచిపోతున్నాయి.  మిగిలినవి వ్యాపార వ్యూహం, పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా నిలిచిపోతున్నాయి. బ్యాంకులు పరస్పర సంప్రతింపుల ద్వారా ఈ దిశగా చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. ఆర్థికశాఖ

Most from this category