News


11300పైన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 11th May 2019
Markets_main1557567587.png-25684

విదేశీ మార్కెట్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచి శుక్రవారం రాత్రి 17.50 పాయింట్లు లాభపడి 11,301.00 పాయింట్ల  వద్ద ముగిసింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు  శుక్రవారం ముగింపు 11307.20 తో పోలిస్తే 6 పాయింట్ల నష్టంతో ఉంది. ఇక శుక్రవారం సెన్సెక్స్‌ 96 పాయింట్లు నష్టపోయి 37,463 వద్ద నిఫ్టీ 23 పాయింట్లు తగ్గి 11,279 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా అమెరికా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు వరుసగా ఎనిమిదో రోజూ నష్టపోయాయి. ప్రధాన సూచీలు వరుసగా ఇన్ని రోజులు నష్టపోవడం ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇదే మొదటిసారి. ఈ ఎనిమిది రోజుల్లో సెన్సెక్స్‌ 1,500పాయింట్లు, నిఫ్టీ 433 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఈ నెలలో జరిగి ఏడు ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఎఫ్‌ఎఫ్‌లు దేశీయ ఈక్విటీ మార్కెట్‌ను నుంచి రూ.4000 కోట్ల వెనక్కి తీసుకున్నారు.



You may be interested

ఇవన్నీ వాల్యూస్టాకులేనా?!

Saturday 11th May 2019

గత నెల గరిష్ఠాల నుంచి ప్రధాన సూచీలు దాదాపు 3 శాత పతనమయ్యాయి. నిఫ్టీ కీలక డీఎంఏలకు దిగువన ట్రేడవుతోంది. తాజా పతనానికి లార్జ్‌క్యాప్స్‌లో వచ్చిన అమ్మకాల ఒత్తిడే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పతనంతో నిఫ్టీ 50లో దాదాపు సగం కంపెనీలు తమతమ పదేళ్ల సరాసరి పీఈ కన్నా దిగువన ట్రేడవుతున్నాయి. కంపెనీ ఎర్నింగ్స్‌కు, స్టాకు ధరకు మధ్య సంబంధాన్ని పీఈ తెలుపుతుంది. పీఈ తక్కువున్న స్టాకులపై టెక్‌

ఐటీసీ ఛైర్మన్‌ దేవేశ్వర్ కన్నుమూత

Saturday 11th May 2019

కార్పోరేట్‌ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్‌ వైసీ దేవేశ్వర్‌(72) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. దేవేశ్వర్‌ ఫిబ్రవరి 4, 1947లో లాహోర్‌ జన్మించారు. ఐఐటీ డిల్లీలో, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఐటీసీ కంపెనీలో 1968లో సామాన్య ఉద్యోగిగా తన జీవితాన్ని మొదలుపెట్టారు. అంచెంచెలుగా ఎదుగుతూ 1996 నాటికి కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ స్థాయికి చేరుకున్నారు. 2017లో కంపెనీ నాన్‌ ఎగ్జూక్యూటివ్‌ ఛైర్మన్‌

Most from this category