STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 54 పాయింట్లు జంప్‌

Saturday 26th January 2019
Markets_main1548480062.png-23813

విదేశీ మార్కెట్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి లాభంతో  10,840.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10,786 పాయింట్లతో పోలిస్తే 54 పాయింట్ల లాభంతో ఉంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ నష్టంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సఫలవచ్చనే ఆశావహనంతో శుక్రవారం ఆసియా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక దేశీయ మార్కెట్‌ విషయానికొస్తే... మిడ్‌సెషన్‌ అనంతరం జరిగిన అ‍మ్మకాలు ఆరంభ లాభాల్ని ఆవిరి చేశాయి. మారుతీ సుజుకీ, జీఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్,  ఐసీఐసీఐ, అల్ట్రాటెక్‌ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీల ర్యాలీని ఒక్కరోజుకే పరిమితం చేశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 169.56 పాయింట్ల నష్టంతో 36, 025 వద్ద, నిఫ్టీ 69 పాయింట్ల క్షీణతతో 10,780 వద్ద స్థిరపడ్డాయి.



You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 3.50శాతం డౌన్‌

Saturday 26th January 2019

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. వీడియోకాన్‌ గ్రూప్‌నకు ముంజూరు చేసిన రుణాల వివాదంలో ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చార్‌పై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఈ బ్యాంకు ఏడీఆర్‌ 3.30శాతం క్షీణించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ 1శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.11శాతం నష్టపోయాయి. మరోవైపు డాలర్‌ మారకంలో రూపాయి బలపడంతో

గ్రాఫైట్‌ స్టాక్స్‌ ఎందుకలా పడుతున్నాయ్‌?

Saturday 26th January 2019

గతేడాది ద్వితీయ భాగంలో గ్రాఫైట్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు ప్రస్తుత పరిణామాలు చూసి నిరాశ చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రంగంలోని రెండు ప్రధాన లిస్టెడ్‌ కంపెనీలు గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ స్టాక్స్‌ వాటి 52 వారాల గరిష్ట స్థాయి నుంచి ఆరు నెలల్లోనే ఇప్పటికి 50 శాతం పడిపోయాయి. శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ఈ రెండూ 52 వారాల కనిష్ట స్థాయిలను నమోదు చేశాయి. గ్రాఫైట్‌

Most from this category