STOCKS

News


లాభాల్లో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 30th March 2019
Markets_main1553930847.png-24869

ఎస్‌సీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి లాభంతో ముగిసింది. సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎస్‌జీఎక్స్‌)లో రాత్రి 11,702 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11680 పాయింట్లతో పోలిస్తే 22పాయింట్ల లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయంగా పరిమాణాలు, దేశీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం సెన్సెక్స్‌ 127 పాయింట్లు లాభంతో 38,673 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 11,624 వద్ద స్థిరపడ్డ సంగతి తెలిసిందే.
ఇక వచ్చేవారంలో సూచీల కదలికలను చూసినట్లైతే...
దేశీయంగా వచ్చేవారంలో జరుగున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధాన పరపతి సమీక్ష సమావేశం మార్కెట్లకు కీలకంకానుంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ అధ్యక్షతన ద్రవ్య విధాన పరపతి సమీక్ష మంగళవారం(ఏప్రిల్‌ 2న) ప్రారంభం కానుంది. మూడు రోజుల సాగే ఈ సమీక్ష సమావేశాలు గురువారం (ఏప్రిల్‌ 4న) ముగియనున్నాయి. నెమ్మదించిన ఆర్థికవృద్ధిని మెరుగుపరిచేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోతపెట్టవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం రెపోరేటు 6.25 శాతంగా అమలవుతోంది. రివర్స్‌ రెపో రేటు సైతం 6.25 శాతం నుంచి 6 శాతానికి పరిమితమైంది. ఎంఎస్‌ఎఫ్‌తోపాటు.. బ్యాంక్‌ రేటు 6.5 శాతానికి దిగివచ్చింది. ఇక అంతర్జాతీయ పరిమాణాల్లో యూరోజోన్‌ బ్రెగ్జిట్‌ అనిశ్చితి, అమెరికా-చైనా  వాణిజ్య చర్చలు మార్కెట్‌ కదలికకు దిశానిర్దేశం కానున్నాయి.  వీటితోపాటు ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు వంటి పలు అంశాలు స్టాక్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయి.



You may be interested

గ్యాస్, యూరియా రేట్లకు రెక్కలు

Saturday 30th March 2019

- 10 శాతం పెరగనున్న సహజ వాయువు రేట్లు - ఏప్రిల్ 1 నుంచి అమలు న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సహజ వాయువు ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి. మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరనున్నాయి. దీంతో సీఎన్‌జీ, పైపుల ద్వారా సరఫరా చేసే వంట గ్యాస్‌ రేట్లతో పాటు యూరియా ఉత్పత్తి వ్యయాలు కూడా పెరగనున్నాయి. ఏప్రిల్‌-సెప్టెంబర్ మధ్య ఆర్నెల్ల వ్యవధికి గాను దేశీయంగా ఉత్పత్తి చేసే

రైల్‌వికాస్‌ నిగమ్‌ ఐపీవో.. బ్రోకరేజీల విశ్లేషణలు

Saturday 30th March 2019

కేంద్ర రైల్వే శాఖకు చెందిన రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ఈ నెల 29న ప్రారంభమైంది. వచ్చే నెల 3న ముగుస్తుంది. ఒక్కో షేరు ఇష్యూ ధరల శ్రేణి రూ.17-19. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరపై అర్ధరూపాయి తగ్గింపు లభిస్తుంది. మొత్తం 25,34,57,280 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. తద్వారా రూ.481 కోట్లు సమీకరించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వరంగ

Most from this category