STOCKS

News


సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో ప్రారంభం

Friday 17th May 2019
Markets_main1558066197.png-25785

మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నడుమ శుక్రవారం దేశీయ మార్కెట్‌ స్వల్ప లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్లు పెరిగి 37,494 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు స్వల్ప లాభంతో  11,262 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఒక్క ఫార్మా తప్ప అన్ని రంగ షేర్లు లాభాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంజీసీ, ఆర్థిక రంగ షేర్లు ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆసియా మార్కెట్లల్లో వాణిజ్య యుద్ధ భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ పలు ప్రధాన మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్‌ వరుసగా మూడో రోజు లాభాలతో ముగిసింది. దిగ్గజ కంపెనీలు అంచనాలకు మించి త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం, ఇటీవల వెల్లడైన ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడం ఇందుకు కారణమైంది. ఇక ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మూడు రోజుల వరుస ర్యాలీకి నేడు బ్రేకు పడింది. రూపాయి విలువ గత ముగింపు (70.03)తో పోలిస్తే 23 పైసలు క్షీణించి 70.26  వద్ద ప్రారంభమైంది.
ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ఫైనాన్స్‌, జీ లిమిటెడ్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 1.70శాతం నుంచి 5శాతం లాభపడగా, టాటామోటర్స్‌, ఐఓసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, హిందాల్కో షేర్లు 1శాతం నుంచి 2శాతం నష్టపోయాయి.



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 17th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఎల్‌ అండ్‌ టీ:- మైండ్‌లో తన వాటాను 26శాతానికి పెంచుకుంది.  ట్రిజెన్‌ టెక్నాలజీస్‌:- హాట్సన్‌ ఇండిపెండెంట్‌ స్కూల్‌కు ఐటీ ప్లేస్‌మెంట్‌ సేవలు అందించేందుకు కాంట్రాక్టు దక్కించుకుంది. మణిప్పురం ఫైనాన్స్‌:- మణిప్పురం అస్సెట్‌ ఫైనాన్స్‌లో 100శాతం ఈక్విటీ వాటాలను కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.  పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌:- హోల్డింగ్స్ పీటీఈ, జనరల్ అట్లాంటిక్ గ్రూపునకు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటా విక్రయ ప్రక్రియను రద్దు

నిఫ్టీ సగం స్టాక్స్‌ ప్రీమియం వ్యాల్యూషన్లలోనే...

Friday 17th May 2019

నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల నుంచి చూస్తే ఐదు శాతం దిగువనే ఉన్నాయి. నిఫ్టీ-50లో కొన్ని స్టాక్స్‌ మాత్రం ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలకు చేరిపోయాయి కూడా. ముఖ్యంగా 22 స్టాక్స్‌ విలువలు వాటి గత 10 ఏళ్ల సగటు పీఈతో పోలిస్తే అధికంగానే ట్రేడవుతున్నాయి. ఇక వోలటాలిటీ ఇండెక్స్‌ నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరిపోయింది. మే 23న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇది మరింత పెరిగిపోతుందన్న అంచనా ఉంది. ఈ

Most from this category