STOCKS

News


2020 నాటికి సెన్సెక్స్‌@ 44,000!

Wednesday 1st May 2019
Markets_main1556728731.png-25458

రిలయన్స్‌ వెల్త్‌ అంచనా
వచ్చే ఏడాది మార్చి నాటికి సెన్సెక్స్‌ 44 వేల పాయింట్లను తాకుతుందని రిలయన్స్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఈఓ నితిన్‌రావు అంచనా వేశారు. ఎన్నికల ఫలితాల తరుణంలో ఎలాంటి పతనం వచ్చినా అది కొనుగోళ్లకు అవకాశంగానే పరిగణించాలని సూచించారు. ఫలితాల కన్నా అంతర్జాతీయ పరిణామాలు, ఎర్నింగ్స్‌ సీజన్‌ మార్కెట్‌ను ఎక్కువ ప్రభావితం చేస్తాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎర్నింగ్స్‌ రికవరీ వృద్ధి12 శాతం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుత ప్రభుత్వం మరలా వస్తుందన్న విషయాన్ని మార్కెట్లు పాక్షికంగా జీర్ణించుకున్నాయన్నారు. కానీ ఫలితాలు అనుకున్నట్లు వస్తే ఒక నెలపాటు ర్యాలీ ఉండొచ్చని చెప్పారు. గతంలో చూస్తే ఎన్నికల ముందు మార్కెట్‌ ర్యాలీ జరపడం, ఎన్నికలు ముగిసే లోపు ఒకమారు ప్రాఫిట్‌ బుకింగ్‌, ఫలితాల అనంతరం స్థిరపడడం జరుగుతోందన్నారు. గతేడాది భారీగా ఎఫ్‌ఐఐల విక్రయాలు చూశామని, ఈ ఏడాది ఇప్పుడిప్పుడే ఈ ఫండ్స్‌ వెనక్కు వస్తున్నాయని నితిన్‌ చెప్పారు. ప్రస్తుత ర్యాలీలో డీఐఐలు పెద్దగా పాలుపంచుకోలేదన్నారు. ఎఫ్‌ఐఐలు లాంగ్‌టర్మ్‌కు ఇండియాపై బుల్లి్‌ష్‌ ధృక్పథంతో ఉన్నారని చెప్పారు. ప్రపంచ ఎకానమీల్లో ఇండియా అంత్యంత వేగంగా వృద్ది సాధించే ఎకానమీల్లో ఒకటిగా ఎఫ్‌ఐఐలు భావిస్తున్నట్లు చెప్పారు. చాలా ఫండ్స్‌ ఇండియా జీడీపీ 7.5 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనాలు వేస్తున్నాయని తెలిపారు. ఇందుకు ఫెడ్‌ స్వరం మారడం, దేశీయంగా వినిమయం జోరందుకోవడం కూడా కారణాలేనన్నారు. దేశీయ క్యాపెక్స్‌ సైకిల్‌లో రికవరీ ఇప్పుడిప్పుడే మొదలైందన్నారు. 
చమురు ధర మ్యాటరే కాదు!
అంతర్జాతీయంగా ముడిచమురు నిల్వలు చూస్తే ప్రస్తుతం క్రూడ్‌ ధర పెరగడం పెద్ద ప్రభావం చూపదని నితిన్‌ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి కెపాసిటీతో పోలిస్తే ప్రస్తుత సరఫరా ఒత్తిళ్లు పెద్ద లెక్కలోకి రావన్నారు. అందువల్ల ఈక్విటీలు ప్రస్తుతం కాస్త వెనకడుగు వేసినట్లు కనిపించినా తిరిగి పరుగులు అందుకుంటాయనే భావిస్తున్నట్లు తెలిపారు. గతేడాది వచ్చిన భారీ పతనం అనంతరం చిన్నస్టాకుల వాల్యూషన్లు బాగా ఆకర్షణీయంగా మారాయని తెలిపారు. ప్రస్తుతం స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో వాల్యూ కనిపిస్తోందని చెప్పారు. గతేడాది ర్యాలీ అనంతరం లార్జ్‌క్యాప్స్‌ వాల్యూషన్లు బాగా పెరిగాయని చెప్పారు. ఈ స్థాయి వాల్యూషన్లకు తగ్గట్లు ఎర్నింగ్స్‌ ఉండాలన్నారు. ఈటీఎఫ్‌ల మార్గంలో పెద్దస్టాకులపై పెట్టుబడులు పెట్టవచ్చని సూచించారు. ఇకపై ఎంఎఫ్‌లు కూడా చిన్నస్టాకుల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ఛాన్సులున్నాయని నితిన్‌ అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపిక చేసిన నాణ్యమైన స్టాకుల్లో పెట్టుబడులను ఎంచుకోవాలని సూచించారు. You may be interested

ఫైనాన్షియల్‌ రంగం చుట్టూ సవాళ్లే!

Wednesday 1st May 2019

ఉదయ్‌ కోటక్‌ విత్త రంగంలో అత్యంత కీలకమైన ఛాలెంజింగ్‌ దశలో ప్రస్తుతమున్నామని ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ అభిప్రాయపడ్డారు. రాబోయే కొన్ని నెలల్లో విత్తరంగం ఎలా బయటపడుతుందనేది ఇప్పుడత్యంత కీలకమని చెప్పారు. చాలా రోజులుగా ఉత్పత్తి, పారిశ్రామిక రంగాల్లో సవాళ్లు విత్తరంగంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చర్చించామని, కానీ ఇప్పుడు నేరుగా ఫైనాన్షియల్‌ రంగంలోనే సవాళ్లు విశ్వరూపం దాల్చాయని తెలిపారు. అందువల్ల దేశీయ ఎకానమీకి వచ్చే ఆరునెలలు కీలకమన్నారు. ఈ దశలో

యస్‌ బ్యాంక్‌ షేరు కొనొచ్చా?

Wednesday 1st May 2019

క్యు4 పేలవ ఫలితాల అనంతరం యస్‌ బ్యాంకు షేరు దాదాపు 30 శాతం పతనమైంది. దీంతో ఒక్కరోజులో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 16వేల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు రూ. 10వేల కోట్ల మేర నష్టం వచ్చింది. ఇందులో ఎంఎఫ్‌ల నష్టం వాటా రూ.1500 కోట్లు కాగా, ఎఫ్‌ఐఐలు రూ. 6500 కోట్ల నష్టం చూశాయి. అనిల్‌ రిలయన్స్‌ గ్రూప్‌నకు బ్యాంకు ఎక్కువ రుణాలిచ్చినట్లు బయటపడడమే ఇంతటి

Most from this category