సెన్సెక్స్ 550 పాయింట్లు క్రాష్
By Sakshi

నిఫ్టీ నష్టం 150 పాయింట్లు మార్కెట్ మరోసారి నిలువునా పతనమైంది. ఒకరోజు సెలవు అనంతరం బుధవారం మిశ్రమంగా ప్రారంభమైన సూచీలు చివరికి భారీ నష్టాలతో ముగిశాయి. ప్రపంచమార్కెట్లో ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోవడం, ఇటలీ బడ్జెట్ సంక్షోభం తెరపైకి రావడం, ఇంట్రాడేలో రూపాయి మళ్లీ జీవితకాల కనిష్టానికి చేరుకోవడం, ఈ వారంలో ఆర్బీఐ సమీక్షా సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత... తదితర కారణాలతో ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక్క మెటల్ షేర్లు తప్ప మిగితా అన్ని రంగాలకు చెందిన షేర్లలో నెలకొన్న అమ్మకాల సునామితో సెన్సెక్స్ 38వేల మార్కును కొల్పోయి 550 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 10900 స్థాయిని కోల్పోయింది. సెప్టెంబర్ నెల విక్రయాలు ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో నేటి ట్రేడింగ్‌లో అటో షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్ 3.50శాతం నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 550 పాయింట్లు కోల్పోయి 35975 వద్ద, నిప్టీ 150 పాయింట్లు నష్టపోయి 10,858 వద్ద ముగిశాయి. కీలకమైన బ్యాంకు నిఫ్టీ 297 పాయింట్లు నష్టపోయి 25,069.90 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో సెన్సెన్స్ 35,911.82 - 36,602.85(619 పాయింట్ల)రేంజ్ కదలాడింది. నిఫ్టీ 10,843.75 - 10,989.05 రేంజ్లో ట్రేడైంది.
యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫ్రాటెల్, ఐషర్ మోటర్స్, ఎంఅండ్ఎం షేర్లు 4శాతం నుంచి 7శాతం నష్టపోయాయి. వేదాంత, హెచ్‌పీసీఎల్, ఇండియాబుల్స్ హౌసింగ్స్ ఫైనాన్స్, యస్‌బ్యాంక్ షేర్లు 3.30శాతం నుంచి 6శాతం లాభపడ్డాయి.
You may be interested
ఆర్థిక సంస్థల మధ్య పరస్పర విశ్వాసం లేదు!!
Wednesday 3rd October 2018యస్ బ్యాంక్ కన్నా ఐసీఐసీఐ బ్యాంక్ ఉత్తమమైన ఎంపికని క్వాంటమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజయ్ దూత్ తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకులకు, అస్థిరతలకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు చాలా మంది అనలిస్ట్‌లు వాటిని కొనండి.. వీటిని కొనండి.. అంటూ సూచనలిస్తుంటారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ మంది మాత్రమే బయటకు
200 డీఎంఏ దిగువకు 60 శాతం షేర్లు
Wednesday 3rd October 2018దేశీయ మార్కెట్లు సెప్టెంబర్‌లో మంచి పతనం చవిచూశాయి. దీంతో నిఫ్టీ 50లో సగానికి పైగా స్టాకులు బలమైన 200 రోజుల డీఎంఏ స్థాయి దిగువకు దిగజారాయి. షేరు చార్టుల్లో 200 రోజుల డీఎంఏ స్థాయి బలమైన మద్దతుగా పరిగణిస్తారు. తాజా పతనంలో పలు బ్లూచిప్ కంపెనీలు ఈ కీలక స్థాయిని కోల్పోయాయి. ఇలా పతనమైన స్టాకుల్లో బజాజ్ ఆటో, యస్ బ్యాక్, కోల్ ఇండియా, ఎయిర్టెల్, హెచ్‌పీసీఎల్, యూపీఎల్, టాటా