STOCKS

News


నష్టాల్లోంచి... లాభాల ముగింపు

Tuesday 11th December 2018
Markets_main1544524566.png-22829

  • ఆదుకున్న ఐటీ, ఫార్మా షేర్ల ర్యాలీ
  • 781 పాయింట్ల రేంజ్‌ కదలాడిన సెన్సెక్స్‌

ఐటీ, ఫార్మా, ప్రభుత్వ రంగ షేర్ల ర్యాలీ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలుబడున్న నేపథ్యంతో పాటు, డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత, ఆర్‌బీఐ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా ఉదంత భయాలతో సూచీలు భారీ గ్యాప్‌ డౌన్‌తో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మిడ్‌సెషన్‌ సమయానికి కల్లా కొనుగోళ్ల అండతో సూచీలు నష్టాలను పూడ్చుకోవడంతో పాటు ట్రేడింగ్‌ చివరికి లాభాలను జత చేసుకోవడం విశేషం. సెన్సెక్స్‌ 781 పాయింట్ల రేంజ్‌లో  35,207.33 - 34,426.29 స్థాయిలో కదలాడింది. నిఫ్టీ సూచీ 233 పాయింట్ల స్థాయిలో 10,333.85 - 10,567.15 మధ్యలో ట్రేడైంది. ట్రేడింగ్‌ చివరి గంటలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 26,163.40 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాలకు చెందిన సూచీల లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఫార్మా ఇండెక్స్‌లు 2.50శాతం ర్యాలీ చేశాయి
నష్టాల్లోంచి లాభాల్లోకి:-
భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు మిడ్‌సెషన్‌ సమాయానికి నష్టాలను పూడ్చుకోగలిగాయి.  కనిష్ట ధరల వద్ద షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం, డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత అధిక వెయిటేజీ కలిగిన ఫార్మా, ఐటీ రంగ షేర్ల ర్యాలీకి సూచీలకు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీల నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి ప్రవేశించాయి.
ఐరోపాల నుంచి సానుకూల సంకేతాలు:-
యూరోపియన్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు మరింత విశ్వాసాన్ని పెంపొందించింది. ఫలితంగా మార్కెట్లో మిడ్‌సెషన్‌ నుంచి కొనుగోళ్లు క్రమంగా పెరిగాయి. ట్రేడింగ్‌ చివరి గంటలో ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు మరింత ఉత్సాహంగా ర్యాలీ చేశాయి. ఓ దశలో నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో 10,567.15 వద్ద, సెన్సెక్స్‌ ఇంట్రాడే 247 పాయింట్ల లాభపడి 35,207.33 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. చివరకు సెన్సెక్స్‌ 35150 వద్ద, నిఫ్టీ 10549 వద్ద ముగిశాయి.
బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీఎయిర్టెల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం నష్టపోగా, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, కోటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పేయింట్స్‌, సన్‌ఫార్మా, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3నుంచి 8శాతం లాభపడ్డాయి.



You may be interested

ఎన్నికల ఫలితాలు మార్కెట్లకు ఎందుకు పట్టలేదు?

Tuesday 11th December 2018

మరోమారు దేశీయ సూచీలు అంచనాలకు భిన్నంగా స్పందించాయి. రాజకీయాలను, ఎన్నికల ఫలితాలను అందరూ చూసేలా కాకుండా వేరే కోణంలో చూస్తామని మార్కెట్లు నిరూపించాయి. ఒకపక్క ఉర్జిత్‌ రాజీనామా వ్యవహారం బెంబేలెత్తిస్తుందని, ఇదే సమయంలో ఎన్నికల ఫలితాలు బీజేపీకి సానుకూలంగా రాకపోవడంతో ఇక భారీ పతనమేనని చాలామంది భావించారు. ఇందుకు తగ్గట్లే మార్కెట్లు సోమవారం ఎగ్జిట్‌ పోల్స్‌కు బాగా నెగిటివ్‌గా స్పందించాయి. మంగళవారం ఆరంభంలో కూడా ఇదే విధంగా భారీ పతనాన్ని

రూపీ, బాండ్స్‌ అప్‌.. కారణం ఇదేనా?

Tuesday 11th December 2018

ప్రారంభంలో నిట్టనిలువునా పతనమైన ఇండియన్‌ రూపాయి తర్వాత మళ్లీ రీబౌండ్‌ అయ్యింది. బాండ్స్‌ కూడా అంతే. కొత్తగా వచ్చే ఆర్‌బీఐ గవర్నర్‌ అనుసరించే పాలసీ విధానాలపై సానుకూల అంచనాలు ఇందుకు కారణం. కాగా ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మార్కెట్‌ వర్గాల్లో వడ్డీ రేట్లు తగ్గించొచ్చని, లిక్విడిటీకి సంబంధించి సరళమైన విధానాలు ఉండొచ్చని, బ్యాంకింగ్‌ నిబంధనలను సరళీకరించొచ్చని అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈక్విటీలు, కరెన్సీ,

Most from this category