STOCKS

News


సెన్సెక్స్‌ మద్ధతు 38850

Monday 28th January 2019
Markets_main1548647450.png-23833

 అమెరికా, యూరప్‌, కొన్ని ఆసియా సూచీలు బ్రేక్‌అవుట్‌ను సాధించి, ముందడుగు వేసినప్పటికీ,  భారత్‌ సూచీలు కీలక స్థాయిల వద్ద నిరోధాన్ని చవిచూసి, వెనకడుగువేసాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందాకొచ్చార్‌పై సిబీఐ..ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయడం, ఐటీసీ బలహీన ఆర్థిక ఫలితాలు, జీ గ్రూప్‌ సంక్షోభం వంటి ప్రతికూల వార్తలకు తోడు ఈ వారంలో వెల్లడికానున్న కేంద్ర బడ్జెట్లో ద్రవ్యలోటు పెరగవచ్చన్న అందోళనలు భారత్‌ మార్కెట్‌ను కిందకు లాగాయి. తాజాగా మరో పెద్ద కార్పొరేట్‌ గ్రూప్‌ అయిన జీ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బ్యాంకింగ్‌ షేర్లు కదిలే తీరు, వ్యవసాయ రంగానికి కేంద్రం ప్రకటిస్తుందని భావిస్తున్న ప్యాకేజీ, బడ్జెట్‌ ప్రతిపాదనలపై విదేశీ ఇన్వెస్టర్లు వ్యవహరించే పెట్టుబడుల శైలికి అనుగుణంగా సమీప భవిష్యత్తులో మన మార్కెట్‌ కదలికలు వుండవచ్చు.  ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే,

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
జనవరి 25తో ముగిసిన వారం ప్రధమార్థంలో 36,700 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సె్‌‍క్స్‌ ద్వితీయార్థంలో 35,953 పాయింట్ల కనిష్టస్థాయి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంకంటే 362 పాయింట్లు నష్టపోయి 36,025 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు వారాల్లో రెండు దఫాలు మద్దతునిచ్చిన 35,850 పాయింట్ల స్థాయి ఈ వారం సెన్సెక్స్‌కు కీలకం. ఈ వారం ఈ స్థాయిని పరిరక్షించుకోగలిగితే మరోదఫా 36,700 పాయింట్ల స్థాయిని పరీక్షించే అవకాశం వుంటుంది. సెన్సెక్స్‌కు తొలుత 36,260 పాయింట్ల స్థాయి నిరోధాన్ని కల్పించవచ్చు. ఈ స్థాయిపైన క్రమేపీ 36,475 పాయింట్ల వరకూ పెరిగే అవకాశం వుంటుంది. ఈ స్థాయిపైన ముగిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడి 36,700 పాయింట్ల వద్దకు పెరిగే ఛాన్స్‌ వుంటుంది. ఈ వారం క్షీణిస్తే 35,850 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే వేగంగా 35,475- 35,380 పాయింట్ల శ్రేణి వద్దకు పతనం కావొచ్చు. ఈ లోపున ముగిస్తే 35000 పాయింట్ల స్థాయికి పడిపోవొచ్చు.

నిఫ్టీ తక్షణ మద్దతు 10,730
గతవారం తొలుత 10,987 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తదుపరి 10,756 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 127 పాయింట్ల నష్టంతో 10,780 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ పెరిగితే నిఫ్టీకి 10,865 పాయింట్ల వద్ద తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన క్రమేపీ 10,930 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. ఇదే స్థాయి నుంచి గత శుక్రవారం అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో నిఫ్టీ పతనమైనందున, ఈ స్థాయిపైన ముగిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుంది. అటుపై క్రమేపీ 10,987 పాయింట్ల స్థాయిని తిరిగి అందుకోవొచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, మార్కెట్‌ నిస్తేజంగా ప్రారంభమైనా, నిఫ్టీకి 10,730 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది.  ఈ స్థాయిలోపున ముగిస్తే 10,630 పాయింట్ల వద్ద క్రమేపీ తగ్గవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే 10,535 పాయింట్ల స్థాయిని  పరీక్షించవచ్చు.



You may be interested

పన్ను బకాయిలేమీ లేవు

Monday 28th January 2019

- ఐటీ నుంచి మైండ్‌ట్రీ షేర్లు విడిపించుకుంటాం - కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ చెబుతున్నట్లుగా తమ కంపెనీ కట్టాల్సిన పన్ను బాకీలేమీ లేవని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ స్పష్టం చేసింది. బాకీలు రాబట్టుకోవడం కోసమంటూ ఆదాయపన్ను శాఖ అటాచ్‌ చేసుకున్న మైండ్‌ట్రీ షేర్లను విడిపించుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపింది. "ఆదాయ పన్ను శాఖ 148, 153ఎ సెక్షన్ల కింద ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా ప్రమోటరు, కంపెనీ

పాజిటివ్‌ ఓపెనింగ్‌

Monday 28th January 2019

సెన్సెక్స్‌ 74 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్లు అప్‌ ఆసియా సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యం‍లో సోమవారం భారత్‌ సూచీలు స్వల్పలాభంతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 74  పాయింట్ల లాభంతో 36,100 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 10,793  పాయింట్ల వద్ద మొదలయ్యింది. శుక్రవారం తీవ్ర పతనాన్ని చవిచూసిన జీ ఎంటర్‌ప్రైజెస్‌ 10 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 350 వద్ద ప్రారంభమయ్యింది. గత శుక్రవారం పటిష్టమైన

Most from this category