News


మూడో రోజూ నష్టాల ప్రారంభమే..!

Monday 14th January 2019
Markets_main1547440490.png-23561

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సూచీలకు ఇది వరుసగా మూడో రోజు నష్టాల ప్రాంరంభం కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరగుదలతో డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ప్రారంభం, కంపెనీల క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర కారణాలు సైతం సూచీలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 167 పాయింట్ల నష్టంతో 35,842 వద్ద, నిఫ్టీ 61 పాయింట్ల నష్టంతో 10,733 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. మెటల్‌ షేర్లు భారీ నష్టాలతో ట్రేడ్‌ అవుతుండగా,  బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లలో సైతం అమ్మకాలు తీవ్రంగా ఉన్నాయి. రూపాయి బలహీనత కారణంగా ఐటీ, ఫార్మా షేర్ల స్వల్పంగా లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.
టాటా స్టీల్‌, గెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, వేదాంత షేర్లు 1.50శాతం నుంచి 2శాతం నష్టపోగా, సన్‌ఫర్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, యస్‌ బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌ ఇన్ఫోసిస్‌ షేర్లు అరశాతం నుంచి 3శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

ఇక ఆసియా మార్కెట్ల విషయానికొస్తే...
చైనా దేశపు డిసెంబర్‌ ఎగుమతి, దిగుమతి గణాంకాలు రెండేళ్ల కనిష్టస్థాయిలో నమోదు కావడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరగుదల, గతవారం ట్రేడింగ్‌ చివరి రోజైన శుక్రవారం అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపు తదితర ప్రతికూలాంశాలతో నేడు ఆసియాలో అన్ని మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోగా, మిగిలిన ఆసియా దేశాలకు చెందిన ఇండెక్స్‌లు అరశాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా జపాన్‌ మార్కెట్‌ నేడు సెలవురోజు.



You may be interested

నిఫ్టీకి 10730- 10650 వద్ద బలమైన మద్దతు!

Monday 14th January 2019

నిఫ్టీ గత కొన్ని వారాలుగా స్వల్ప రేంజ్‌లో ట్రేడవుతోంది. కొన్ని స్టాకులు మాత్రమే సూచీల్లో చురుగ్గా ఉంటున్నాయి. సోమవారం నిఫ్టీ నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ  10800 పాయింట్ల దిగువన, సెన్సెక్స్‌ 35900 పాయింట్ల దిగువన ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 10730- 10650 పాయింట్ల జోన్‌లో బలమైన మద్దతు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయిలను కాపాడుకోలేకపోతే 10300 పాయింట్లకు పతనమయ్యే ఛాన్సులున్నాయని అంచనా. పైస్థాయిలో 10870- 10940 పాయింట్ల

ఆ పెట్టుబడి విషయంలో పొరపాటు జరిగింది: పొరింజు 

Monday 14th January 2019

స్మాల్‌క్యాప్‌ సిగార్‌, ఏస్‌ ఇన్వెస్టర్‌ ఇలా పలు పేర్లతో సుపరిచితుడు... పొరింజు వెలియాత్‌ గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా అనే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సంస్థను నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్న పొరింజు... గతేడాది మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ పతనంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆయన నిర్వహణలోని ఆస్తుల విలువకు గట్టిగానే చిల్లుపడింది. తాజాగా తన పెట్టబడుల వ్యవహారంలో ఓ పెద్ద తప్పిదాన్ని ఆయన అంగీకరించారు. లయడ్‌

Most from this category