STOCKS

News


5 రోజుల లాభాలకు బ్రేక్‌

Tuesday 22nd January 2019
Markets_main1548151685.png-23733

మార్కెట్‌ మంగళవారం నష్టంతో ముగిసింది. మార్కెట్‌ వరుసగా 5రోజుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, హెవీవెయిట్‌ షేర్ల పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. భారత్‌ పెరుగుతున్న ద్రవ్యలోటుపై ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేయడం సైతం సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ముఖ్యంగా మెటల్‌, ఐటీ, అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. సెన్సెక్స్‌ 134 పాయింట్లను కోల్పోయి 36,444 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 39 పాయింట్ల నష్టంతో 10923 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 50పాయింట్లు కోల్పోయి 27482 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2.20శాతం నష్టపోగా, ఫార్మా ఇండెక్స్‌ 2శాతం లాభపడింది.
ఇంట్రాడే డే ట్రేడింగ్‌ సాగిందిలా:-
ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలను అందుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నేడు నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 80 పాయింట్ల నష్టంతో 36,500 వద్ద, నిఫ్టీ 30పాయింట్ల నష్టంతో 10931 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ప్రధాన రంగాలకు చెందిన షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల బాటలో సాగాయి. ఇంట్రాడేలో మెటల్‌ రంగ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, ఐటీ రంగ షేర్లలో సైతం అమ్మకాలు తీవ్రతరం కావడంతో ఇంట్రాడేలో ఒకానొక దశలో సెన్సెక్స్ 296 పాయింట్లను కోల్పోయి 36,283 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు నష్టపోయి 10,962 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. అయితే చివరి గంట కొనుగోళ్లు సూచీల నష్టాలను కొంత వరకు తగ్గించాయి. 

జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, జీ లిమిటెడ్‌, ఎంఅండ్‌ఎం, టాటాస్టీల్‌, వేదాంత షేర్లు 2.50శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, డాక్టర్‌ రెడ్డీస్‌, కోటక్‌బ్యాంక్‌, టైటాన్‌, విప్రో, సన్ ఫార్మా షేర్లు 1.50శాతం నుంచి 5శాతం లాభపడ్డాయి.



You may be interested

క్యు3లో దిగ్గజాల పోర్టుఫోలియో మార్పులు

Tuesday 22nd January 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈక్విటీలు తీవ్ర ఒడిదుడుకులు చూశాయి. ఒకదశలో భారీగా పతనమై మరలా క్రమంగా కోలుకున్నాయి.  ఇలాంటి సంక్షోభ సమయంలో దేశంలో ప్రముఖ దిగ్గజ ఇన్వెస్టర్లు ఏం కొన్నారు? ఏం అమ్మారు? చూద్దాం.. - రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా: కొనుగోళ్లు: ఫెడరల్‌ బ్యాంక్‌, ఎన్‌సీసీల్లో ఒక శాతానికి మించి వాటా పెంచుకున్నారు. జుబిలాంట్‌ లైఫ్‌, ఆప్‌టెక్‌లో గణనీయంగా కొనుగోళ్లు చేశారు. అమ్మకాలు: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ర్యాలీస్‌ఇండియా, టైటన్‌, లుపిన్‌లో దాదాపు 0.02 నుంచి

బ్రోకరేజ్‌ల లాంగ్‌టర్మ్‌ రికమండేషన్లు

Tuesday 22nd January 2019

1. జస్ట్‌డయిల్‌: నోమురా నుంచి కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 765. ఎస్‌ఎంఈ అడ్వర్టైజింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అత్యంత వ్యయనియంత్రిత కంపెనీ. క్యు3లో మంచి ఫలితాలు చూపింది. ఈ రంగంలో పోటీ ఉన్నా, టైర్‌2, 3 నగరాలకు విస్తరించడం ద్వారా పోటీని తట్టుకుంటోంది. 2. కోటక్‌మహీంద్రా బ్యాంక్‌: సీఎల్‌ఎస్‌ఏ నుంచి కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1500. ఎర్నింగ్స్‌లో 21 శాతం చక్రీయవార్షిక వృద్ధి ఉంటుంది. ఎన్‌ఐఐలో 23 శాతం పెరుగుదల అత్యంత

Most from this category