STOCKS

News


ఆరంభం అదిరింది కానీ.. ముగింపులో నష్టాలే..

Monday 22nd October 2018
Markets_main1540203524.png-21366

  • సెన్సెక్స్‌ 181 పాయింట్లు డౌన్‌
  • 34,134 పాయింట్ల వద్ద ముగింపు
  • 58 పాయింట్ల నష్టంతో 10,245కు నిఫ్టీ

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,315 పాయింట్లతో పోలిస్తే 374 పాయింట్ల లాభంతో 34,689 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,303 పాయింట్లతో పోలిస్తే 102 పాయింట్ల లాభంతో 10,405 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. బ్యాంకింగ్‌, ఆటో రంగ స్టాక్స్‌లో కొనుగోళ్లు ఇందుకు కారణం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ కారణంగా ఇండెక్స్‌ల లాభాలు పెరిగాయి. అయితే ఇండెక్స్‌లు చివరి వరకు ఆ లాభాలను కొసాగించలేకపోయాయి. ఇన్వెస్టర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, విప్రో, ఇన్ఫోసిప్‌, ఏసియన్‌ పెయింట్స్‌ వంటి బ్లూచిప్‌ స్టాక్స్‌లో ప్రాఫిట్‌ బుకింగ్‌ చేసుకోవడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు సెన్సెక్స్‌ 181 పాయింట్ల నష్టంతో 34,134 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 10,245 వద్ద ముగిశాయి.  

నిఫ్టీ-50లో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఏకంగా 9 శాతంమేర లాభపడింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు 4 శాతానికిపైగా పెరిగాయి. ఇక ఎన్‌టీపీసీ 2 శాతానికిపైగా ఎగసింది. బజాజ్‌ ఆటో, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్‌ షేర్లు 1 శాతానికిపైగా పెరిగాయి. అదేసమయంలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 7 శాతంమేర పతనమైంది. బీపీసీఎల్‌ 5 శాతంమేర పడిపోయింది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 4 శాతంమేర క్షీణించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లు 3 శాతానికిపైగా నష్టపోయాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐఓసీ, హిందుస్తాన్‌ పెట్రోలియం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఓఎన్‌జీసీ షేర్లు 2 శాతానికిపైగా పడిపోయాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌ల విషయానికి వస్తే.. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్‌ 1 శాతానికిపైగా నష్టపోయింది. 

రూపాయి సోమవారం నష్టాల్లోనే ఆరంభమైంది. 73.41 వద్ద ప్రారంభమైంది. తర్వాత కోలుకొని లాభాల్లోకి వచ్చింది. అయితే మళ్లీ నష్టాల్లోకే వెళ్లింది. సాయంత్రం 3:45 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు నష్టపోయి 73.44 వద్ద ట్రేడవుతోంది. కాగా రూపాయి శుక్రవారం ముగింపు స్థాయి 73.33గా ఉంది. 



You may be interested

నెల రోజుల కోసం పది రికమండేషన్లు

Monday 22nd October 2018

వచ్చే నెల రోజుల్లో దాదాపు 17 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను వివిధ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. 5నాన్స్‌ డాట్‌కామ్‌ దినేశ్‌రోహిరా సిఫార్సులు- 1. ఐటీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 306. స్టాప్‌లాస్‌ రూ. 275. గత నెల రోజుల్లో దాదాపు 17 శాతం పతనమైంది. దిగువన రూ. 270 స్థాయిల్లో బలమైన మద్దతు పొంది పైకి ఎగిసింది. మార్కెట్లు నెగిటివ్‌గా ఉన్నా కొద్దికాలంగా స్టాకు అప్‌మూవ్‌లోనే ఉంది. తాజాగా 200

ఇంకో రౌండ్‌ కరెక‌్షన్‌ ఉంది.. తొందరొద్దు..

Monday 22nd October 2018

ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌లో మరో విడత కరెక‌్షన్‌ మిగిలే ఉందని ఎడిల్‌వీజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినయ్‌ ఖట్టర్‌ తెలిపారు. అందువల్ల ఇన్వెస్టర్లు తొందపడొద్దని సూచించారు. మరికొంత కాలం వేచిచూడడమే ఉత్తమమని తెలిపారు. ఇటీవలి మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలను రీబ్యాలెన్స్‌ చూసుకోవాలని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  విదేశీ ఇన్వెస్టర్లు చాలా వరకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని

Most from this category