STOCKS

News


ఆద్యంతం ఊగిసలాట... నష్టాల ముగింపు

Friday 12th July 2019
Markets_main1562926761.png-27023

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ముగిశాయి. సెన్సెక్స్‌ 86.88 పాయింట్ల నష్టంతో 38,736.23 వద్ద, నిఫ్టీ 30.40 పాయింట్లును కోల్పోయి 11,552.50 వద్ద స్థిరపడింది. నేడు మార్కెట్‌ ముగింపు అనంతరం దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ క్యూ1 ఫలితాలను వెల్లడితో పాటు, మే మాసపు ఐఐపీ గణాంకాలు, జూన్‌ నెల వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) గణాంకాలు విడుదల కానుడంటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు.  క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత తదితర ప్రతికూలాంశాలు సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంజీసీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్‌, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, మీడియా, ఐటీ,  అటో రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 324 పాయింట్ల రేంజ్‌లో 38,684.85 -  39,021.84 రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 102 పాయింట్లు స్థాయిలో 11,538.60- 11,639.55 శ్రేణిలో కదలాడింది. ఇక వారం మొత్తంగా చూస్తే సెన్సెక్స్‌ 777 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 260  పాయింట్లను కోల్పోయింది. 
ఎల్‌ అండ్‌ టీ, కోల్‌ ఇండియా, బజాజ్‌ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, విప్రో షేర్లు 1శాతం నుంచి 3శాతం నష్టపోగా, యస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పేయింట్స్‌, సన్‌ఫార్మా, వేదాంత షేర్లు 2శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

రూపీ స్వల్పకాలిక టార్గెట్‌ 67.50!

Friday 12th July 2019

చార్ట్‌ అడ్వైజ్‌ అంచనా కొన్ని వారాలుగా 69 స్థాయిల వద్ద కన్సాలిడేట్‌ చెందిన రూపాయి క్రూడాయిల్‌ ధరలుతగ్గడం, అంతర్జాతీయ పరిణామాలతో బలపడడం ఆరంభించింది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ప్రకటించిన చర్యలు రూపీ మరింత బలపడేందుకు దోహదం చేస్తాయని చార్ట్‌ అడ్వైజ్‌ ప్రతినిధి రాజా వెంకట్‌రామన్‌ అభిప్రాయపడ్డారు. వర్ధమాన మార్కెట్‌ ఎకానమీల్లో స్వల్పరికవరీ సైతం ఇందుకు తోడ్పాటునిస్తుందన్నారు. మార్కెట్లో గత పరిణామాలకు అనుగుణంగానే రూపీ 69 స్థాయిని తాకిందన్నారు. ఇకపై ఇక్కడ నుంచి

ఇండస్‌ఇండ్‌ లాభంలో 38 శాతం వృద్ధి

Friday 12th July 2019

జూన్‌ త్రైమాసికానికి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నికర లాభం 38.30 శాతం పెరిగి రూ. 1432.50 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో బ్యాంకు రూ. 1036 కోట్ల లాభం ప్రకటించింది. బ్యాంకు క్యు1లో రూ. 1181 కోట్ల లాభం ప్రకటించవచ్చని మార్కెట్‌ అంచనా వేసింది. క్యు1లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం అంచనాలకు దాదాపు అనుగుణంగా రూ. 2844 కోట్లుగా నమోదయింది. ఇదే సమయంలో స్థూల ఎన్‌పీఏలు 2.1 శాతం

Most from this category