News


సెన్సెక్స్‌ లాభం 537 పాయింట్లు

Friday 17th May 2019
Markets_main1558089540.png-25803

  • 11400లపై ముగిసిన నిఫ్టీ 

మార్కెట్‌ వారంతపు రోజైన శుక్రవారం భారీ లాభంతో ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక, అటో, బ్యాంకింగ్‌, మీడియా, రియల్టీ రంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సూచీలు భారీగా లాభాల్ని ఆర్జించాయి. సెన్సెక్స్‌ 537 పాయింట్ల లాభంతో 37,930 వద్ద, నిఫ్టీ 150 పాయింట్ల పెరిగి11,407ల వద్ద స్థిరపడింది. సూచీలకు ఇది వరుసగా రెండో లాభాల ముగింపు. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంకు నిఫ్టీ 595 పాయింట్లు(2శాతం) పెరిగి 29,450 వద్ద ముగిసింది. అయితే, ఫార్మా, ఐటీ రంగ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్‌ ప్రారంభం నుం‍చి ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ పూనుకున్నారు. ఫలితంగా నిఫ్టీ ఇండెక్స్‌ 11350 నిరోధ స్థాయిని దాటేసింది. ఇకపై నిఫ్టీకి  11,550 వద్ద గట్టి నిరోధం ఎదురవుతుందని మార్కెట్‌ విశ్లేషకులు వివరించారు. శుక్రవారం ట్రేడింగ్‌ ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 608 పాయింట్లు లాభపడి 38001 స్థాయి వద్ద, నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి 11,426.15 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ఈ రోజు ట్రేడింగ్‌లో హీరో మోటర్‌కార్ప్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 4శాతం నుంచి 8.50శాతం లాభపడగా, హిందాల్కో, వేదాంత, ఐఓసీ, యస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 1.50 శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎంచుకున్న స్టాక్స్‌

Friday 17th May 2019

ఏప్రిల్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. అదే నెలలో విదేశీ నిధులు రావడంతో మార్కెట్లు పై స్థాయిల్లో కొనసాగేందుకు సాయపడింది. అయితే, మే నెలకు వచ్చే సరికి విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయందారులుగా మారిపోయారు. దీంతో ఈ సమయంలో మన మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇనిస్టిట్యూషన్స్‌ ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి. గత నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోళ్లు తగ్గినప్పటికీ... ఈఎల్‌ఎస్‌ఎస్‌ సహా ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.5,800 కోట్ల మేర

డా.రెడ్డీస్‌ లాభంలో 44 శాతం వృద్ధి

Friday 17th May 2019

మార్చి త్రైమాసికానికి డా.రెడ్డీస్‌ ల్యాబ్‌ నికరలాభం 44 శాతం పెరిగి రూ. 434.40 కోట్లను చేరింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ రూ. 302.20 కోట్ల లాభం నమోదు చేసింది. అయితే క్యు3తో పోలిస్తే నికరలాభం 10 శాతం పతనమైంది. క్యు4లో విక్రయాలు గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరిగి రూ. 4016.6 కోట్లకు చేరాయి. ఎబిటా మార్జిన్‌ 2017-18క్యు4లో 16.3 శాతం, 2018-19క్యు3లో 22.5 శాతం ఉండగా, తాజా

Most from this category