STOCKS

News


రూపాయి ర్యాలీతో ఆరో రోజూ లాభాలే

Tuesday 18th December 2018
Markets_main1545128752.png-23051

  • 10900 పైన నిఫ్టీ
  • కలిసొచ్చిన చివరి గంట కొనుగోళ్లు

రూపాయి ర్యాలీతో మార్కెట్‌ ఆరోరోజూ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా షేర్లలో కొనుగోళ్లతో మంగళవారం నిఫ్టీ సూచీ 10,900పైన ముగియగా  సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభాల్ని ఆర్జించింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో పాటు ఐదురోజులుగా సూచీల ర్యాలీ కారణంగా నేటి ఉదయం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు పూనుకోవడంతో మార్కెట్లో మిడ్‌సెషన్‌ వరకు నష్టాల్లో కొనసాగింది. అయితే అనూహ్యంగా రూపాయి ర్యాలీ మార్కెట్‌ను నష్టాల నుంచి గట్టెక్కించింది. అంతర్జాతీయంగా మార్కెట్లో ముడిచమురు ధరల పతనం, వడ్డీరేట్లపై ఫెడ్‌ నిర్ణయం కోసం ఎదురుచూపులతో డాలర్‌ ఇండెక్స్‌ నీరసించడం తదితర కారణాలు రూపాయికి ర్యాలీకి కలిసొచ్చాయి. ఫలితంగా ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 70.73 కనిష్టానికి బలపడింది. రూపాయి ర్యాలీ మార్కెట్‌ వర్గాల్లో తిరిగి విశ్వాసాన్ని నింపడటంతో మిడ్‌సెషన్‌ నుంచి కొనుగోళ్లు మొదలయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు క్రమంగా పెరగడంతో సూచీలు నష్టాల్లోకి లాభాల్లోకి వచ్చాయి. చివరి గంటలో కొనుగోళ్లు మరింత పెరగడంతో నిఫ్టీ సూచీ 20 పాయింట్లు లాభపడి 10,900పైన 10909 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభంతో 36347 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 158.90 పాయింట్ల లాభంతో 27,174.70 వద్ద ముగిసింది. అత్యధికంగా పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడింది. రూపాయి ర్యాలీతో ఐటీ ఇండెక్స్‌, ఐటీసీ అరశాతం పతనంతో నిఫ్టీ ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌, జీ లిమిటెడ్‌ షేరు భారీ పతనంతో నిఫ్టీ మీడియా ఇండెక్స్‌ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 36,270.07- 36,375.38 రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 10,819.10 - 10,915.40 స్థాయిలో ట్రేడైంది.

ఎం అండ్‌ ఎం, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ పార్మా షేర్లు 2శాతం నుంచి 3శాతం లాభపడగా, విప్రో, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్‌, యూపీఎల్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 1.50శాతం నుంచి 8.50శాతం నష్టపోయాయి.



You may be interested

2019 బీజేపీ ఓడినా.. ట్రాక్‌లోనే మార్కెట్‌!!

Tuesday 18th December 2018

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా కూడా స్టాక్‌ మార్కెట్‌ ట్రాక్‌లోనే ఉంటుందని మార్కెట్‌ నిణుపుడు అంబరీష్‌ బాలిగా తెలిపారు. బుల్‌ మార్కెట్‌లో హోల్డింగ్‌ కంపెనీలు మంచి పనితీరు కనబరుస్తాయని, అందువల్ల వచ్చే 2 ఏళ్ల లక్ష్యంతో ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 2019 ప్రారంభంలో మార్కెట్‌ పేలవంగా ఉండొచ్చని అంచనా వేశారు. అయితే

కొత్త ఏడాదికి క్రెడిట్‌సూసీ సిఫార్సులు

Tuesday 18th December 2018

వచ్చే సంవత్సరంలో మంచి రాబడినందించే సత్తా ఉన్న నాలుగు స్టాకులను క్రెడిట్‌సూసీ రికమండ్‌ చేసింది. 1. ఎల్‌అండ్‌టీ: అవుట్‌పెర్ఫామ్‌. టార్గెట్‌ రూ. 1700. దేశీయంగా రికవరీ మెరుగుపడడం, బలమైన నిధుల ప్రవాహం, ఆకర్షణీయమైన వాల్యూషన్లు, ఒకే ప్రాంతంపై ఎక్కువగా ఆధారపడే అవసరం తగ్గడం.. కంపెనీ షేరుపై ఆసక్తి పెంచుతున్నాయి. మార్జిన్లు అనూహ్యంగా పెరిగి అనుకోని అప్‌సైడ్‌ కదలికలను తీసుకురావచ్చు. హైదరాబాద్‌మెట్లో నష్టాలు తగ్గడం, ప్రైవేట్‌ పెట్టుబడుల సైకిల్‌ ఆరంభం కావడంతో కంపెనీ

Most from this category