STOCKS

News


సెన్సెక్స్‌ తక్షణ మద్దతు 38,475

Monday 1st April 2019
Markets_main1554100886.png-24898

ప్రపంచ వృద్ధి రేటు తగ్గుతుందన్న అంచనాలతో ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లు తగ వారం పరిమిత శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయితే, భారత్‌ మార్కెట్లోకి విదేశీ నిధులు కుప్పతెప్పులుగా వెల్లువెత్తడంతో మన సూచీలు మరో ముందడుగు వేశాయి. కానీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ త్వరలో ప్రారంభం కానుండడం, కార్పొరేట్‌ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండడం వంటి అంశాల నేపథ్యంలో భారత మార్కెట్‌ మరింత ముందుకు వెళ్లగలుగుతుందా లేదా అన్న శంశయం ప్రస్తుతం విశ్లేషకుల్లో నెలకొని ఉంది. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... 

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
మార్చి 29తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 508 పాయింట్లు పెరిగి 38,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ పెరిగితే తొలుత 38,880 పాయింట్ల వద్దకు చేరొచ్చు. అటుపైన గత ఆగస్ట్‌ గరిష్ట స్థాయి అయిన 38,990 పాయింట్ల వరకు అప్‌ట్రెండ్‌ కొనసాగవచ్చు. అటు తర్వాత ముగిస్తే 39,200 పాయింట్ల స్థాయికి జంప్‌ చేయవచ్చు. ఈ వారం మార్కెట్‌ తగ్గితే 38,475 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభ్యమవుతున్నది. ఈ స్థాయిని కోల్పోతే 38,150 పాయింట్ల వరకు తగ్గొచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 37,700 పాయింట్ల వద్ద గట్టి మద్దతు లభిస్తున్నది.  

నిఫ్టీ తక్షణ మద్దతు 11,540
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గత కాలమ్‌లో ప్రస్తావించిన 11,630 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 165 పాయింట్ల లాభంతో 11,624 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ అప్‌ట్రెండ్‌ కొనసాగితే తొలుత 11,680 పాయింట్ల వరకు పెరగొచ్చు. అటుపై క్రమేపీ గత ఆగస్ట్‌ రికార్డు స్థాయి అయిన 11,760 పాయింట్ల వరకు అందుకోవచ్చు. ఆ పైన ముగిస్తే 11,810 పాయింట్ల వరకు పెరగవచ్చు. ఈ వారం మార్కెట్‌ తగ్గితే 11,540 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 11,450 పాయింట్ల వరకు క్షీణించొచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే వేగంగా 11,345 పాయింట్ల వరకు క్షీణించొచ్చు.



You may be interested

డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా

Monday 1st April 2019

ప్ర: మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి మూలధన లాభాలపై పన్నులు ఎలా  ఉంటాయో కొంత వరకూ అవగాహన ఉంది. అయితే పాక్షికంగా విత్‌డ్రాయల్స్‌ విషయంలో పన్నులు ఎలా ఉంటాయి ? -అనురాధ, హైదరాబాద్‌  జ:  మీరు కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేసి కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లు కొనుగోలు చేశారు. దీంట్లో కొంత భాగాన్ని విక్రయించారనుకుందాం.  మీరు యూనిట్లు కొనుగోలు చేసిన తేదీ, యూనిట్లను విక్రయించిన తేదీలను పరిగణనలోకి తీసుకొని మీకు వచ్చిన లాభాలు

నవయుగ కంటెయిన్‌ టర్మినల్‌ సరికొత్త రికార్డు

Monday 1st April 2019

5,00,000 టీఈయూల మైలురాయిని అధిగమించిన సంస్థ హైదరాబాద్‌: నవయుగ కంటెయినర్‌ టర్మినల్‌ (ఎన్‌సీటీ) సరుకు రవాణాలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 5,00,000 టీఈయూల (భారీ ఓడల నిర్వహణ సామర్థ్యాన్ని లెక్కించే కొలమానం) హ్యాండ్లింగ్‌ను 2019 మార్చి 27న తొలిసారిగా చేరుకున్నట్టు సంస్థ ప్రకటించింది. ఎం.వి ఎస్‌ఎస్‌ఎల్‌ కుచ్‌ వెస్సెల్‌ ద్వారా దీన్ని సాధించినట్టు తెలిపింది. 2013-14లో 58,577 టీఈయూల సామర్థ్యం నుంచి చూస్తే ఐదేళ్ల కాలంలో 9

Most from this category