News


తక్షణ మద్దతు శ్రేణి 35,510-35,375

Monday 18th February 2019
Markets_main1550472361.png-24241

కొద్దినెలలుగా ప్రపంచ ట్రెండ్‌కు భిన్నంగా దేశీయ సూచీలు కదులుతూ వస్తున్నాయి. ఇదేరీతిలో గతవారం ప్రపంచ మార్కెట్లన్నీ కొద్దిపాటి హెచ్చుతగ్గులతో నెలల గరిష్టస్థాయి వద్ద ట్రేడవుతుండగా, భారత్‌ మార్కెట్‌ మాత్రం రెండు శాతంపైగా క్షీణించింది.  మరిన్ని కార్పొరేట్‌ గ్రూప్‌లు రుణాల చెల్లింపులో డిఫాల్ట్‌అయ్యే సంకేతాలు, మరో రెండు, మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణం కావొచ్చు. మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించే హెవీవెయిట్‌ షేర్లలో ఇన్ఫోసిస్‌ మినహా మిగిలినవన్నీ వాటి ఇటీవలి గరిష్టస్థాయి నుంచి 3-10 శాతం మధ్య క్షీణించాయి. కొద్ది వారాల నుంచి స్థిరంగా వున్న హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం కూడా క్రితం వారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడాన్ని పరిశీలిస్తే...సమీప భవిష్యత్తులో మార్కెట్‌ గరిష్టస్థాయిలో నిలదొక్కుకోవడం కష్టసాధ్యమేనని భావించవచ్చు.  ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, 


సెన్సెక్స్‌ సాంకేతికాలు...
ఫిబ్రవరి 15తో ముగిసిన వారంలో గత మార్కెట్‌ పంచాంగంలో సూచించినరీతిలోనే 36,480 దిగువకు తగ్గినంతనే డౌన్‌ట్రెండ్‌ మొదలై 35,510 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంకంటే 737 పాయింట్ల నష్టంతో 35,809 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం వేగంగా 36,100పైకి చేరి స్థిరపడకపోతే, సెన్సెక్స్‌ డౌన్‌ట్రెండ్‌ కొనసాగే అవకాశం వుంటుంది. ఈ సందర్భంలో తొలి మద్దతు 35,510-35,375 పాయింట్ల శ్రేణి మధ్య లభిస్తోంది. ఈ శ్రేణి దిగువన ముగిస్తే గత డిసెంబర్‌ 11 నాటి కనిష్టస్థాయి అయిన 34,426 పాయింట్ల వద్దకు పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఆ మధ్య 35,010 పాయింట్ల వద్ద ఒక తాత్కాలిక మద్దతు లభించవచ్చు. ఇక ఈ వారం 36,100 పాయింట్ల వద్ద తొలి అవరోధం ఏర్పడవచ్చు. ఆపైన స్థిరపడితే 36,375 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 36,590 పాయింట్ల వరకూ పెరగవచ్చు.  

తక్షణ అవరోధం 10,790
గత కాలమ్‌లో సూచించిన 10,925 పాయింట్ల దిగువకు వచ్చినంతనే డౌన్‌ట్రెండ్‌ను ప్రారంభించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,620 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయిది.చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 220 పాయింట్ల నష్టంతో 10,724 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 10,790 పాయింట్ల సమీపంలో తక్షణ అవరోధం కలగవచ్చు. ఆపైన ముగిస్తేనే తదుపరి రిలీఫ్‌ర్యాలీ సాధ్యపడి 10,890 పాయింట్ల వరకూ కొనసాగే ఛాన్స్‌ వుంటుంది. అటుపై 10,930 పాయింట్ల స్థాయి గట్టిగా నిరోధించవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, మార్కెట్‌ బలహీనంగా ప్రారంభమైనా 10,620-10,580 పాయింట్ల శ్రేణి మధ్య తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ లోపున ముగిస్తే తదుపరి రోజుల్లో 10,333 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. మధ్యలో 10,535 పాయింట్ల వద్ద ఒక తాత్కాలిక మద్దతును పొందవచ్చు.You may be interested

స్లాబ్‌ మారకుండా పన్ను ఊరట ఎలా ?

Monday 18th February 2019

 ప్ర: నేను గత ఏడేళ్ల నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇక ఇప్పటి నుంచి నేరుగా షేర్లలోనే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. షేర్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ: నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు మూడు ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది. మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న కంపెనీ గురించి సమాచారం తెలుసుకోవాలి. రెండోది మ్యూచువల్‌ ఫండ్స్‌తో పోల్చితే షేర్లపై స్టాక్‌ మార్కెట్‌

వొడాఫోన్‌ ఐడియాకు రూ.20,000 కోట్లు !

Monday 18th February 2019

-టవర్ల వాటా, ఆప్టిక్‌ ఫైబర్‌ విక్రయం ద్వారా  న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియా కంపెనీ మొబైల్‌ టవర్‌ సంస్థ, ఇండస్‌ టవర్‌లో వాటా విక్రయించాలని యోచిస్తోంది. ఈ వాటా విక్రయంతో పాటు ఆప్టికల్‌ ఫైబర్‌ ఆస్తులను కూడా విక్రయించనున్నది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.  విక్రయాల్లో భాగంగా ఇండస్‌ టవర్స్‌లో 11.15 శాతం వాటాను, అలాగే 1.56 లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విక్రయించనున్నారు. ఈ విక్రయాల కారణంగా రూ.20,000 కోట్లు

Most from this category