STOCKS

News


11,750పైన ముగిసిన నిఫ్టీ

Friday 26th April 2019
Markets_main1556275595.png-25373

39000 పైకి సెన్సెక్స్‌
రాణించిన మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లు 

చివరిగంట కొనుగోళ్లతో మార్కెట్‌ శుక్రవారం లాభంతో ముగిసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 6నెలల గరిష్టం నుంచి దిగిరావడం, ఈ వారంలో ఇప్పటి వరకూ ప్రకటితమైన కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌వర్గాలను మెప్పించడం, దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్‌ 336 పాయింట్ల లాభపడి 39వేల పైన 39067.33 వద్ద, నిఫ్టీ 112.90 పాయింట్లు పెరిగి 11,750 పైన 11754.70 వద్ద ముగిసింది. మెటల్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక, ఐటీ, రియల్టీ, ఫార్మా రంగాలకు చెందిన షేర్లు లాభపడగా, అటో, మీడియా రంగ షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,103.16-38,765.33 రేంజ్‌లో ట్రేడవ్వగా, నిఫ్టీ 11,661.75 - 11,762.90 స్థాయిలో కదలాడింది. ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంకు నిఫ్టీ 452 పాయింట్లు పెరిగి 30000ల పైన 30,013 వద్ద ముగిసింది. నేడు మే ఎంఅండ్‌ డెరివేటివ్స్‌ ఫ్యూచర్‌ ప్రారంభ రోజు కావడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తాజా కొనుగోళ్లకు తెరలేపారు. కార్పోరేట్‌ కంపెనీల ఫలితాల వెల్లడి, క్రూడాయిల్‌ ధరల పెరగుదలతో రూపాయి, ఈక్విటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఈ వారంలో సూచీలు తీవ్ర లాభనష్టాల మధ్య ఉగిసలాడాయని ఫెర్‌వెల్త్‌ సెక్యూరిటీ రీసెర్చ్‌ హెడ్‌ ప్రకాశ్‌ పాండే అభిప్రాయపడ్డారు. 

జేఎస్‌డబ్లూ‍్యస్టీల్‌, గెయిల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బీపీసీఎల్‌, టాటాస్టీల్‌ షేర్లు 2.50శాతం నుంచి 7శాతం లాభపడగా, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ అటో, గ్రాసీం, టాటామోటర్స్‌ షేర్లు 1శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో పెరిగిన జున్‌జున్‌వాలా వాటా... దేనికి సంకేతం?

Friday 26th April 2019

ప్రముఖ స్టాక్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ జున్‌జున్‌వాలా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీలో మార్చి త్రైమాసికంలో వాటా పెంచుకున్నారు. డిసెంబర్‌ త్రైమాసికం నాటికి ఉన్న వాటాతో పోలిస్తే 0.73 శాతం పెరిగి మార్చి చివరికి 3.19 శాతానికి చేరింది. గతేడాది ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు నిధుల లభ్యత సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ పరిణామాలు, అనంతరం కంపెనీ ఖాతాల్లో అక్రమాలు ఉన్నాయంటూ కోబ్రా పోస్ట్‌ పోర్టల్‌ ప్రచురించిన కథనం

మెటల్‌ షేర్ల మెరుపులు

Friday 26th April 2019

ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ శుక్రవారం 2శాతం ర్యాలీ చేసింది. నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2,991.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  అలాగే నిన్న క్యూ4 ఫలితాలను ప్రకటించిన టాటాస్టీల్‌ కంపెనీ షేర్లు నేడు 7శాతం ర్యాలీ చేయడం కూడా మెటల్‌ షేర్ల ర్యాలీకి తోడ్పాటునిచ్చింది. జిందాల్‌ స్టీల్‌ 5శాతం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హిందాల్కో షేర్లు 2.50శాతం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, సెయిల్‌ షేర్లు అరశాతం ర్యాలీ

Most from this category