STOCKS

News


38000 పైన సెన్సెక్స్‌

Friday 15th March 2019
Markets_main1552642404.png-24629

దేశీయ మార్కెట్‌ శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి ఇంట్రాడే గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయ మార్కెట్లోకి విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం, డాలర్‌ మారకంలో రూపాయి వరుసుగా ఐదో రోజూ బలపడటం, ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతావరణం దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. ఫలితంగా ఐటీ, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ ర్యాలీ అండతో శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి ఇంట్రాడే గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌-రూపీ స్వాప్‌ యాక్షన్‌ మార్గంలో మూడేళ్లలో 500 కోట్ల డాలర్ల నిధులను ఆర్‌బీఐ అందించనుండటంతో రుణ వృద్ది మరింతగా మెరుగుపడుతుందనే భావనతో బ్యాంక్‌ షేర్లు రెండో రోజూ లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2నెలల గరిష్టాన్ని తాకింది. ప్రధాన సూచీలైన నిఫ్టీ ఇండెక్స్‌ 144 పాయింట్లు లాభపడి 11,487 వద్ద, సెన్సెక్స్‌ 500 పాయింట్లు పెరిగి 38,255 ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు సెన్సెక్స్‌ గతముగింపు(37,755)తో పోలిస్తే 458 పాయింట్లు పెరిగి 38,213.36 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 11,476 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎఫ్‌ఎంజీసీలో ఐటీ షేర్లు తప్ప మిగిలిన అన్నిరంగ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. 



You may be interested

బ్యాంకు నిఫ్టీ భారీ ర్యాలీకి కారణాలేంటి?

Friday 15th March 2019

ఫిబ్రవరి వరకు నేల చూపులు చూసిన బ్యాంకు నిఫ్టీ మార్చి ఆరంభం నుంచి జూలు విదిల్చింది. రోజురోజుకు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ కదం తొక్కుతోంది. బ్యాంకు నిఫ్టీ అండతో నిఫ్టీ సైతం ర్యాలీ మూడ్‌లోకి వచ్చింది. మార్చిలో బ్యాంకు నిఫ్టీ ఇంతవరకు దాదాపు 10 శాతం ర్యాలీ జరిపింది. పీఎన్‌బీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ, బీఓబీ, ఆర్‌బీఎల్‌ తదితర పలు బ్యాంకు స్టాకులు 20 శాతం వరకు ర్యాలీ

ఫైనాన్షియల్‌, నిర్మాణ రంగ మిడ్‌క్యాప్స్‌ మేలు!

Friday 15th March 2019

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ మిడ్‌క్యాప్‌ రంగంలో ఫైనాన్స్‌, నిర్మాణ రంగాల్లోని కంపెనీల్లో విలువైనవి దొరుకుతాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ప్రతినిధి నిశ్చల్‌ మహేశ్వరి చెప్పారు. ఫైనాన్షియల్స్‌లో ఎంఎఫ్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు మంచి పురోగతి చూపుతున్నాయన్నారు. బ్యాంకింగ్‌ రంగానికి నిఫ్టీలో అధిక వెయిటేజ్‌ ఉన్నందున నిఫ్టీ ప్రదర్శన మెరుగయ్యేకొద్దీ ఫైనాన్షియల్‌ రంగ ప్రదర్శన కూడా మరింత మెరుగుపడుతుందన్నారు. అందువల్ల ఈ రంగ స్టాకులను ప్రస్తుతానికి విక్రయించవద్దని సూచించారు. కావాలంటే బ్యాంకు షేర్లలోనే ఒకదాని నుంచి మరోదానికి మారుతూఉండొచ్చన్నారు.

Most from this category