STOCKS

News


మూడో రోజూ లాభాల ముగింపే

Friday 28th December 2018
Markets_main1545992952.png-23292

  • 10850పైన నిఫ్టీ ముగింపు
  • 36000పైన ముగిసిన సెన్సెక్స్‌

ఫార్మా, ఫైనాన్స్‌ షేర్లు ర్యాలీతో సూచీలు వరుసగా మూడోరోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల అంశాలతో సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం స్థిరమైన ర్యాలీని చేశాయి. అయితే చివరి గంటలో అమ్మకాలు జరగడంతో సూచీల లాభాలు కొంతమేర తగ్గాయి. ప్రపంచమార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ ప్రోత్సాహంతో సూచీలు జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ను లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 105 పాయింట్ల లాభంలో 35,912 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 10,821 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కేంద్రం 7 ప్రభుత్వ రంగ బ్యాంకుల‌కు రూ.28615 కోట్ల మూల‌ధ‌నం సమకూరుస్తున్నట్లు ప్రక‌టించ‌డంతో బ్యాంకింగ్‌ షేర్లు జోరును కనబరిచాయి. అలాగే సన్‌ ఫార్మా ర్యాలీ అండతో ఫార్మా షేర్లలో సైతం కొనుగోళ్లు వెల్లువెత్తాయి. మార్కెట్‌కు ప్రతికూలంగా ప్రభావితం చేసే ఎలాంటి వార్తలు లేకపోవడంతో ఇంట్రాడేలో సూచీలు సాఫీగా ర్యాలీ చేశాయి. దీనికి తోడు మిడ్‌సెషన్‌ అనంతరం యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లను మరింత కొనుగోళ్లకు పురిగొలిపింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ ఒకానొక దశలో 388 పాయింట్ల లాభపడి 36,194.78 వద్ద, నిప్టీ సూచీ 106 పాయిం‍ట్లు లాభపడి 10,893.60 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే సూచీలు గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతుండటం, నేడు ఈ వారం ముగింపు రోజు కావడంతో చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ఫలితంగా సూచీలు గరిష్ట స్థాయిలను నుంచి దిగివచ్చాయి. చివరకు సెన్సెక్స్‌ 269 పాయింట్ల లాభపడి 36,076 వద్ద, నిఫ్టీ సూచీ 80 పాయింట్లు లాభపడి 10,859.90 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో  బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం లాభంతో 27,125.25 వద్ద ముగిసింది.  అత్యధికంగా ఫార్మా ఇండెక్స్‌ 1.75శాతం లాభపడింది.
బజాజ్‌ ఫైనాన్స్‌, జీ లిమిటెడ్‌, ఐఓసీ, సన్‌ఫార్మా, టైటాన్‌ షేర్లు 2శాతం నుంచి 4శాతం లాభపడగా, ఏషియన్‌ పేయింట్స్‌, బజాజ్‌-అటో, టీసీఎస్‌, బీపీసీఎల్‌, ఇన్ఫ్రాటెల్‌, షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి.



You may be interested

రెండు రంగాలపై మోతీలాల్‌ఓస్వాల్‌ పాజిటివ్‌

Friday 28th December 2018

కొత్త సంవత్సరం పీఎస్‌యూ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ రంగాలపై పాజిటివ్‌గా ఉన్నట్లు మోతీలాల్‌ఓస్వాల్‌ ప్రతినిధి యోగేశ్‌ మెహతా చెప్పారు. ప్రభుత్వం మరోమారు పీఎస్‌బీలకు రీక్యాప్‌ సాయం అందిస్తోందని, దీంతో లిక్విడిటీ సమస్యలు గట్టెక్కుతాయని అభిప్రాయపడ్డారు. పీఎస్‌యూ బ్యాంకుల ఆస్తుల నాణ్యత సైతం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందన్నారు. వచ్చే రెండు మూడు త్రైమాసికాల్లో ఈ మెరుగుదల మరింత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం చాలా బ్యాంకుల షేర్లు వాటి బుక్‌వాల్యూ కన్నా తక్కువ వాల్యూషన్ల వద్ద డిస్కౌంట్‌కు

భారీ ప్రీమియంతో భారత్‌ మార్కెట్లు

Friday 28th December 2018

వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత ఈక్విటీ మార్కెట్లు భారీ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. వచ్చే ఏడాది కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ బాగా పెరుగుతాయన్న అంచనాలు దేశీయ సూచీలను పరుగులు తీయించాయి. ప్రస్తుతం ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌తో పోలిస్తే నిఫ్టీ సుమారు 100 శాతం ప్రీమియంతో ఉంది. నిఫ్టీ ట్రయిలింగ్‌ 12 నెలల పీఈ 22 వద్ద ఉండగా, ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ పీఈ 11.45 వద్ద ఉంది. 2000 సంవత్సరం తర్వాత

Most from this category