STOCKS

News


గ్యాప్‌అప్‌ ప్రారంభం...కొద్ది నిముషాల్లోనే నష్టాల్లోకి

Tuesday 8th January 2019
Markets_main1546920099.png-23459

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నా, మంగళవారం భారత్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా ప్రారంభమయ్యింది. అయితే కొద్ది నిముషాల్లోనూ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.  114 పాయింట్ల లాభంతో  35,965 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ...వెనువెంటనే 65 పాయింట్ల నష్టాలోకి మళ్లింది. 14 పాయింట్ల పెరుగుదలతో 10,786 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ...వెనువెంటనే 24 పాయింట్ల నష్టపోయి 10,750 పాయింట్ల దిగువకు పడిపోయింది. మెటల్‌ షేర్లు టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంతలు ట్రేడింగ్‌ ప్రారంభంలో 1.5 శాతం పెరగ్గా, ఆటోమొబైల్‌ షేర్లు టాటా మోటార్స్‌,  ఐషర్‌ మోటార్స్‌లు 1 శాతం చొప్పున పెరిగాయి. పవర్‌గ్రిడ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌లు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి.  

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు

గత రాత్రి అమెరికా సూచీలు స్వల్పంగా పెరిగినప్పటికీ, తాజాగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 0.5 శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ సూచీలు స్వల్ప లాభాలతోనూ, తైవాన్‌ వెయిటెడ్‌, కొరియా కోస్పి, చైనా షాంఘై సూచీలు స్వల్ప నష్టాలతోనూ కదులుతున్నాయి. 



You may be interested

నెల రోజులకు పది సిఫార్సులు

Tuesday 8th January 2019

వచ్చే నెల రోజుల్లో 3- 12 శాతం రాబడినిచ్చే పది స్టాక్‌ ఐడియాలను మార్కెట్‌ నిపుణులు రికమండ్‌ చేస్తున్నారు. దినేశ్‌రోహిరా రికమండేషన్లు: 1. ఎస్కార్ట్స్‌': కొనొచ్చు. టార్గెట్‌ రూ. 759. స్టాప్‌లాస్‌ రూ. 680.  2. హిందాల్కో: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 201. స్టాప్‌లాస్‌ రూ. 228. 3. జేఎస్‌డబ్ల్యు స్టీల్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 142. స్టాప్‌లాస్‌ రూ. 155. మజార్‌మొహమద్‌ రికమండేషన్లు: 1. వేదాంత: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 203. స్టాప్‌లాస్‌ రూ. 183.  2. భారతి

స్వల్పంగా తగ్గిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Tuesday 8th January 2019

 ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం ఉదయం 8.50 గంటలకు స్వల్ప తగ్గుదలతో కదులుతోంది. క్రితం రోజు భారత్‌లో నిఫ్టీ ఫ్యూచర్‌ 10805 వద్ద ముగియగా, ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 10,797 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత రాత్రి అమెరికా సూచీలు స్వల్పంగా పెరిగినప్పటికీ, తాజాగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 0.5 శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ సూచీలు స్వల్ప లాభాలతోనూ,

Most from this category