STOCKS

News


నిఫ్టీ 200 పాయింట్ల పతనం

Friday 21st December 2018
Markets_main1545388202.png-23143

  • సెన్సెక్స్‌ 689 పాయింట్లు డౌన్‌
  • 35,742 వద్ద ముగింపు

రెండు వారాల నుంచి ప్రపంచ మార్కెట్లతో సంబంధం లేకుండా అలుపెరుగని ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు శుక్రవారం హఠాత్‌ పతనాన్ని చవిచూశాయి. ఇండెక్స్‌లు దాదాపు 2 శాతం మేర పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 689 పాయింట్ల నష్టంతో 35,742 వద్ద, నిఫ్టీ 198 పాయింట్ల నష్టంతో 10,754 వద్ద ముగిశాయి.  
ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35,694- 36,483 పాయింట్ల శ్రేణిలో, నిఫ్టీ 10,738- 10,963 పాయింట్ల శ్రేణిలో కదలాడాయి. 

నిఫ్టీ-50లో కేవంలో ఐదు స్టాక్స్‌ మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఇందులో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ షేర్లు ఉన్నాయి. ఇందులో హెచ్‌పీసీఎల్‌ మాత్రమే 2 శాతానికి పైగా పెరిగింది. మిగతావి స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అదేసమయంలో ఐవోసీ 5 శాతానికి పైగా పతనమైంది. యూపీఎల్‌ 4 శాతానికి పైగా పడిపోయింది. అదానీ పోర్ట్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, మారుతీ సుజుకీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, విప్రో షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ గరిష్టంగా 2 శాతానికి పైగా పతనమైంది. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు 1-2 శాతం శ్రేణిలో నష్టపోయాయి. నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లు తక్కువగా క్షీణించాయి.  

గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లు పడిపోవడం, రూపాయి క్షీణత, హెవీవెయిట్‌ షేర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా నష్టపోవడం, మార్కెట్లు ఓవర్‌బాట్‌ జోన్‌లో ఉండటం, ప్రపంచ వృద్ధి మందగమన ఆందోళనలు, ఫెడ్‌ రేట్ల పెంపు వంటి అంశాలు స్టాక్‌ మార్కెట్‌ పతనానికి బాటలు వేశాయి. 



You may be interested

భారీగా పడిన స్టాక్స్‌... పెరిగిన ప్రమోటర్ల వాటా

Friday 21st December 2018

2018 సంవత్సరంలో కొన్ని కంపెనీల షేర్లు వివిధ కారణాల నేపథ్యంలో పతనాలను చవిచూశాయి. ఆశ్చర్యకరంగా ఈ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా స్వల్పంగా పెరిగింది. ఆ వివరాలే ఇవి....   మన్‌పసంద్‌ బెవరేజెస్‌ గుజరాత్‌ కేంద్రంగా పనిచేసే పళ్ల రసాల తయారీ కంపెనీ. ఈ ఏడాది ఈ స్టాక్‌ 80 శాతం పడిపోయింది. ప్రమోటర్ల వాటా మాత్రం 0.36 శాతం పెరిగింది. జూన్‌ క్వార్టర్‌ ఫలితాలకు ముందు, కంపెనీ సమాచారం ఇవ్వడం లేదంటూ ఆడిటింగ్‌ సంస్థ

బ్యాంక్‌ నిఫ్టీ పతనం

Friday 21st December 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం భారీగా పతనమైంది. సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ పడిపోయాయి. బ్యాంక్‌ నిఫ్టీ కూడా బాగానే క్షీణించింది. 1.42 శాతం లేదా 388 పాయింట్ల క్షీణతతో 26,886 పాయింట్లకు పడిపోయింది. ఇండెక్స్‌లోని దాదాపు షేర్లు నష్టపోయాయి. అయితే పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌,

Most from this category