STOCKS

News


లాభాలతో ప్రారంభం: క్షణాల్లో నష్టాల్లోకి

Tuesday 5th March 2019
Markets_main1551759205.png-24429

మూడురోజుల విరామం తరువాత మార్కెట్‌ మంగళవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 123  పాయింట్ల లాభంతో 36,141 వద్ద, నిఫ్టీ 2  పాయింట్ల స్వల్పలాభంతో 10,865 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో తగ్గని ఉద్రిక్తతలు, మనదేశం నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై వాణిజ్య సుంకాలను విధిస్తామని ట్రంప్‌ చేసిన ప్రకటన సూచీల ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభమైన క్షణాల్లో సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 20 పాయింట్ల నష్టంతో 36,044వద్ద, నిఫ్టీ 16 పాయింట్లను కోల్పోయి 10,847 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఎక్కువగా ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎఫ్‌ఎంజీసీ, అటో, ఫార్మా షేర్లు సైతం నష్టాల బాట పట్టాయి. మరోవైపు మెటల్‌ షేర్లలో కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్‌, రియల్టీ రంగ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. 

జీలిమిటెడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌మహీంద్రా, ఐషర్‌మోటర్స్‌, విప్రో షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోగా, గ్రాసీం, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో రూ.13,000 కోట్ల అవకతవకలు

Tuesday 5th March 2019

గ్రాంట్‌ థార్న్‌టన్‌ ఆడిట్‌లో వెల్లడి న్యూఢిల్లీ: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపులో రూ.13,000 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు గ్రాంట్‌ థార్న్‌టన్‌ సంస్థ ఆడిట్‌లో వెలుగు చూసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపునకు 24 డైరెక్ట్‌ సబ్సిడరీలతోపాటు, 135 పరోక్ష సబ్సిడరీలున్నాయి. అలాగే, ఆరు జాయింట్‌ వెంచర్‌ కంపెనీలు, నాలుగు అసోసియేట్‌ కంపెనీలతో కూడిన ఈ గ్రూపునకు రూ.94,000 కోట్ల రుణ భారం ఉంది. మంజూరైన రుణాలను గ్రూపు కంపెనీలు అప్పటికే ఉన్న రుణాల

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 5th March 2019

టాటామోటార్స్‌:- జేఎల్‌ఆర్‌లో వాటా విక్రయంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టత ఇచ్చిం‍ది.  

Most from this category