STOCKS

News


10450లపై ప్రారంభమైన నిఫ్టీ

Friday 2nd November 2018
Markets_main1541130983.png-21648

ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభంతో ప్రారంభమైంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 260 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 10450పైన ప్రారంభమయ్యాయి. చైనాతో నెలకొన్న వాణిజ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ప్రపంచమార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నేడు ఆసియాలో కూడా అన్ని మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ నేడు లాభాలతోనే ప్రారంభమైంది. ఉదయం 9:30ని.లకు సెన్సెక్స్‌  388.63  పాయింట్లు లాభంతో 34820.60, వద్ద, నిఫ్టీ 119.40 పెరిగి 10500.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలపడంతో ఐటీ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అత్యధిక లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1శాతం పెరిగింది. ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, కోల్‌ఇండియా, విప్రో షేర్లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి. హీరోమోటర్‌కార్ప్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ , బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పేయింట్స్‌, 3నుంచి 5శాతం లాభపపడ్డాయి.



You may be interested

35 పైసలు పుంజుకున్న రూపాయి

Friday 2nd November 2018

డాలరుతో 73.10 వద్ద ప్రారంభం ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఉదయం 35 పైసలు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో 73.10 దగ్గర ప్రారంభమయ్యింది. డాలరు విలువ బలహీనపడడం, ముడిచమురు ధరలు ఒక్కసారిగా పతనం కావడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో రూపాయి విలువ పుంజుకుందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు వివరించారు. ఇదే సమయంలో దేశీ మార్కెట్‌లు భారీ లాభాల్లో ప్రారంభం కావడం కూడా

భారీ నష్టాలను మిగిల్చిన అక్టోబర్‌

Thursday 1st November 2018

ఇన్వెస్టర్లకు 2009 తర్వాత అత్యంత నష్టాలను మిగిల్చిన మాసం ఈ ఏడాది అక్టోబర్‌. గత నెలలోనే నిఫ్టీ 10,004 పాయింట్ల కనిష్ట స్థాయి వరకూ పడిపోగా, సెన్సెక్స్‌ 33,776 వరకు తగ్గి ఆ తర్వాత కొంత రికవరీ అయ్యాయి. ఒక్క గత నెలలో ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్ల మేర తమ వాటాల విలువను నష్టపోయారు. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.144.86 లక్షల కోట్ల వద్ద సెప్టెంబర్‌

Most from this category