STOCKS

News


35000 దిగువకు సెన్సెక్స్‌

Tuesday 1st January 2019
Markets_main1546319322.png-23340

  • 35వేల దిగువకు సెన్సెక్స్‌
  • 10850 కోల్పోయిన నిఫ్టీ

కొత్త ఏడాది మార్కెట్‌ ఒడిదుడుల మధ్య ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. నేడు సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.., వెనువెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఫలితంగా సెన్సెక్స్‌ సూచీ 36వేల మార్కును, నిఫ్టీ సూచీ 10,850 కీలకస్థాయిని కోల్పోయింది. ఉదయం గం.10:00లకు సెన్సెక్స్‌ సూచీ 122 పాయింట్లు కోల్పోయి 35,952 వద్ద, నిఫ్టీ సూచీ 37 పాయింట్లు 10,825 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఫార్మా, రియల్టీ రంగ ఇండెక్స్‌ మాత్రమే లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, మిగిలిన అన్నిరంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఫార్మా, నిర్మాణరంగ షేర్ల అండతో నేడు సెన్సెక్స్‌ 93 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 36,162 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల పెరుగుదలతో 10,882 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.



You may be interested

బ్యాంకింగ్‌ రంగంలో రికవరీ షురూ

Tuesday 1st January 2019

- ఎన్‌పీఏలు తగ్గుతున్నాయ్‌ - పీఎస్‌బీల్లో మరిన్ని సంస్కరణలు అవసరం - ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ - అర్ధ సంవత్సర ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల ముంబై: పేరుకుపోయిన మొండిబకాయిలు తగ్గుతుండడంతో బ్యాంకింగ్‌ రంగం ఊపిరి పీల్చుకుంటోందని ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. బ్యాంకింగ్‌ రంగం రికవరీ బాట పట్టినా, పీఎస్‌యూ బ్యాంకుల్లో పాలనా పరంగా మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆర్‌బీఐ అర్ధ వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికను

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 1st January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హెచ్‌డీఎఫ్‌సీ:- గృహ రుణాలకు వర్తించే రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును బ్యాంక్‌ 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌:- ద్రవ్య కొరతతో డిసెంబర్‌ 31న డిబెంచర్‌ హోల్డర్లకు ఎన్‌సీడీలపై వడ్డీని చెల్లించడంలో విఫలమైంది. జిందాల్‌ స్టీల్‌ & పవర్‌:- ప్రస్తుతం కంపెనీ సీఈవో పదవీబాధ్యతలు నిర్వర్తిసున్న నౌషాద్ అక్తర్ అన్సారీ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. అవాస్‌ ఫైనాన్షియర్:- ఐదేళ్లపాటు కంపెనీ సీఈవోగా

Most from this category