STOCKS

News


మెటల్‌, అటో షేర్ల మెరుపులు

Monday 15th April 2019
Markets_main1555319789.png-25140

మార్కెట్‌ ర్యాలీకి మెటల్‌, అటో షేర్లు అండగా నిలుస్తున్నాయి. ఆర్థిక మందగమన ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో మెటల్‌ షేర్లు, టాటామోటర్స్‌ ర్యాలీతో అటో షేర్లు లాభాల బాట పట్టాయి.
మెటల్‌ షేర్లు:- అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో దేశీయంగా మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. చైనా ఎగుమతుల 5నెలల గరిష్టానికి చేరుకోవడంతో పాటు అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు తుదిదశకు చేరుకోవడంతో అంతర్జాతీయ ఆర్థిక మందగమనం తగ్గుముఖం పట్టవచ్చనే అంచనాలు మార్కెట్‌ వర్గాల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెటో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. అందులో భాగంగానే దేశీయ మెటల్‌ షేర్లు నేడు లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.50శాతం పెరిగింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన సెయిల్‌, ఏపిల్‌ అపోలో, వెల్‌స్పాన్‌కార్పోరేషన్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌ 3శాతం లాభపడ్డాయి. అలాగే హిందాల్కో, హిందూస్థాన్‌ కాపర్‌, నాల్కో, ఎన్‌ఎండీసీ, మెయిల్‌, షేర్లు 2శాతం నుంచి 1శాతం పెరిగాయి. అలాగే వేదాంత అరశాతం పెరిగింది. అయితే జేఎస్‌ఎల్‌ఆర్‌ హిస్సార్‌ స్టీల్‌ మాత్రం పావుశాతం నష్టపోయింది. 
అటో షేర్లు:- టాటామోటర్స్‌ 6శాతం ర్యాలీ చేయడంతో ఇదే రంగంలోని ఇతర అటో షేర్లకు ఉత్సాహనిచ్చింది. దీంతో అటో ఇండెక్స్‌ సోమవారం ఇంట్రాడేలో 1.50శాతం లాభపడింది. టాటామోటర్స్‌ షేరుతో పాటు భారత్‌ఫోర్జ్‌, మదర్స్‌ సుమీ, హీరోమోటోకార్ప్‌, ఎక్సైడ్‌ షేర్లు 4శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. అలాగే అపోలోటైర్స్‌, అమరరాజాబ్యాటరీస్‌, టాటామోటర్స్‌డీవీఆర్‌, బజాజ్‌ అటో 2నుంచి శాతం పెరిగాయి. అలాగే ఎంఅండ్‌ఎం ఐషర్‌ మోటర్స్‌, మారుతీ, భాష్‌ లిమిటెడ్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి.



You may be interested

సంక్షోభాన్ని ప్రతిబింబించని జెట్‌ షేరు... ఎందుకు?

Monday 15th April 2019

సాధారణంగా సంక్షోభాల్లో ఉన్న కంపెనీల షేర్లు డీలా పడి ట్రేడవుతుంటాయి. కంపెనీలో ఇబ్బందులన్నీ సదరు షేరు ధరలో ప్రతిబింబిస్తుంటాయి. కానీ ఇందుకు విరుద్ధంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఒకపక్క కంపెనీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా, షేరు మాత్రం ఒక మోస్తరు కరెక‌్షన్‌ మాత్రమే చవిచూసింది. అసలు కంపెనీ ఉంటుందా? మూతపడుతుందా? అన్న సంశయాలు నడుస్తున్న వేళ షేరు మాత్రం గత రెండు వారాల్లో దాదాపు 2.3

10670పైన కొనసాగితే అప్‌సైడ్‌!

Monday 15th April 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా సోమవారం నిఫ్టీ అప్‌మూడ్‌లో కొనసాగుతోంది. క్రమంగా 116900 పాయింట్ల వరకు చేరింది. గతవారం కదలాడిన 11550- 11700 రేంజ్‌ పైఅవధిని చేరింది. వీక్లీ చార్టుల్లో నిఫ్టీ లోయర్‌హై, లోయర్‌లో ఏర్పరిచింది. దీంతో ఏడువారాల అప్‌ట్రెండ్‌ తర్వాత తొలిసారి డైన్‌సైడ్‌ సంకేతాలు ఇచ్చినట్లయింది. అయితే తిరిగి సోమవారం నిఫ్టీ స్థిరంగా అప్‌మూవ్‌ కొనసాగించడంతో ట్రేడర్లు అయోమయంలో ఉన్నారు. నిఫ్టీ ప్రస్తుత కదలికలను చూస్తే 11550 పాయింట్లను కాపాడుకున్నంత కాలం

Most from this category