STOCKS

News


స్వల్పలాభంతో ప్రారంభం

Wednesday 16th January 2019
Markets_main1547611224.png-23609

మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నడుమ దేశీయ మార్కెట్‌ బుధవారం స్వల్ప లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో 36320 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 10,899 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. నిన్న బ్రిటన్‌ పార్లమెంట్‌లో బ్రిగ్జిట్‌ పై జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 432 మంది,  202 మంది అనుకూలంగా ఓటు వేశారు. అలాగే అమెరికా ప్రభుత్వం ఇంకా షట్‌డౌన్‌లో కొనసాగతుండటం ఇన్వెస్టర్లను కలవరపరుస్తుంది. అయినప్పటికీ, టెక్నాలజీ, ఇంటర్నెట్‌ షేర్ల ర్యాలీతో నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్ 0.65 శాతం, ఎస్ అండ్ పీ500 ఇండెక్స్ 1శాతం,  నాస్‌డాక్ 1.70 శాతం లాభపడ్డాయి.నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు చైనా ఉద్దీపనల చర్యల ప్రకటన లాంటి సానుకూల సంకేతాలు, మరోవైపు బ్రెగ్జిట్‌ అంశం ఓటమి ఆందోళనలు నడుమ నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. నికాయ్ సూచీ 1శాతం నష్టపోగా, షాంగై సూచీ ఫ్లాట్ గా ట్రేడవుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఉదయం గం.9:30ని.లకు న్సెక్స్‌ 126 పాయింట్ల లాభంతో 36,445 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 10,919 వద్ద ట్రేడింగ్‌ అవుతున్నాయి.
వేదాంత, ఇన్ఫ్రాటెల్‌, గ్రాసీం, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, జీలిమిటెడ్‌ షేర్లు 1.50శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. సన్‌ఫార్మా, ఐటీసీ, భారతీఎయిర్‌టెల్‌, టెక్‌మహీంద్రా, యూపీఎల్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి.



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 16th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇండోరమా సింథటిక్స్‌:- కంపెనీ ప్రధాన ప్రమోటర్లకు ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.361 కోట్లను నిధుల సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇండియా నెదర్లాండ్‌ బీవీ కంపెనీకి ప్రతి షేరు ధర రూ.36 చొప్పున మొత్తం 8.30 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.299 కోట్లను సమీకరించనుంది. అలాగే సియామ్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ ప్రతి షేరు ధర రూ.36 చొప్పున

ఎన్నికల ఫలితాల వేళ ఎలా ట్రేడ్‌ చేయాలి?

Tuesday 15th January 2019

యూబీఎస్‌ సూచనలు త్వరలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న వేళ మార్కెట్లో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు వెనకాముందాడుతున్నారు. ఎన్నికల వేళ ప్రభుత్వం పాపులర్‌ విధానాలవైపు మొగ్గు చూపవచ్చన్న అంచనాలున్నాయి. ఎన్నికల అనంతరం ఎలాంటి ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వాన్ని బట్టి నిఫ్టీ ఎలా స్పందిస్తుంది, ఏ ప్రభుత్వం వస్తే ఏ రంగాలను ఎంచుకొని ట్రేడ్‌ చేయాలనే అంశాలపై ఇన్వెస్టర్లకు పలు సందేహాలున్నాయి. ఈ సందేహాలకు యూబీఎస్‌ సమాధానమిస్తోంది. సీన్‌1: బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం:

Most from this category