News


ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్‌

Thursday 20th December 2018
Markets_main1545301445.png-23114

ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు ప్రభావంతో దేశీయ మార్కెట్‌ ఏడురోజుల సుధీర్ఘర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్ల పతనంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 52 పాయింట్ల నష్టంతో 36,432 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 10,951 వద్ద ముగిసింది. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటు పెంపుతో అమెరికా, ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ సంకేతాలను అందుకున్న సూచీలు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 163 పాయింట్ల నష్టంతో 36,321 వద్ద, నిఫ్టీ సూచి 82 పాయింట్ల నష్టంతో 10,885 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇంట్రాడేలో మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలతో ఇంట్రాడేలో ఒకానోకదశలో సెన్సెక్స్‌ 281 పాయిం‍ట్లను కోల్పోయి 36,203 వద్ద, నిఫ్టీ సూచి 87 పాయింట్లను కోల్పోయి 10,880 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదుచేశాయి. అయితే మిడ్‌సెషన్ డాలర్‌ మారకంలో రూపాయి రికవరి, అటో, ఫార్మా, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు క్రమక్రమంగా నష్టాలను పూడ్చుకున్నాయి. ఫలితంగా నిఫ్టీ ఇంట్రాడేలో కోల్పోయిన 10950 మార్కును తిరిగి అందుకుంది.
1.టైర్ల కంపెనీల షేర్లైన జేకే టైర్స్‌ (7.50శాతం), టీవీస్‌ శ్రీ చక్ర (4శాతం), అపోలో టైర్స్‌ (3శాతం), సియట్‌ (2.50శాతం), ఎంఆర్‌ఎఫ్‌(1శాతం)లాభపడ్డాయి. ఈ శనివారం జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో అటోమొబైల్‌ టైర్ల ప్రస్తుతం విధిస్తున్న 28శాతం జీఎస్టీని 18శాతానికి తగ్గించవచ్చనే అంచనాలతో టైర్ల షేర్ల ర్యాలీకి కారణమయ్యాయి.
2.రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కి చెందిన స్పెక్ట్రమ్‌ వ్యాపారాన్ని రిలయన్స్‌ జియో కంపెనీకి విక్రయించేందుకు గల ప్రధాన అడ్డంకులపై చర్చించేందుకు ఇరు కంపెనీల సీనియర్‌ అధికారులు డిపార్ట్‌మెంట్‌ఆఫ్‌టెలికామ్‌ సెక్రటరీ​అరుణ సందరరాజన్‌ను కలిశారు. ఈ కారణంగా రియలన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేరు ఇంట్రాడేలో 3శాతం ర్యాలీ చేసింది.
3.షేర్ల బై బ్యాక్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వరంగానికి చమురు ఉత్పాదక కంపెనీ ఓఎన్‌జీసీ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇవ్వడంతో ఈ షేరు 1శాతం లాభపడింది. ప్రతి షేరు ధర రూ.159లు చొప్పున మొత్తం 2.34శాతం వాటాను సమానమైన ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయనుంది. సుమారు రూ.4,022 కోట్ల విలువైన ఈ బైబ్యాక్‌ ఇష్యూకు జనవరి 04ను రికార్డు తేదిగా ప్రకటించింది. కేంద్రం ప్రభుత్వం ఈ ఇష్యూ ద్వారా ఓఎన్‌జీసీకి ఈక్విటీ షేర్లను విక్రయించి రూ.2,714 కోట్లను సమీకరించాలని యోచిస్తుంది.
4. రూ. 275 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్లను జారీచేయనుందనే వార్తలు వెలుగులోకి రావడంతో ఇండియాబుల్స్‌హౌసింగ్‌ 3.50శాతం లాభపడి ఎన్‌ఎస్‌ఈలో నిప్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో మొదటిస్థానాన్ని దక్కించుకుంది.  

వేదాంత, విప్రో, భారతీఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, గ్రాసీం షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టపోగా, హీరోమోటోకార్ప్‌, యూపీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 2నుంచి 4శాతం లాభపడ్డాయి.You may be interested

ఫార్మా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా...? ఒక్క నిమిషం!

Friday 21st December 2018

ఫార్మా రంగ స్టాక్స్‌ చాలా తక్కువ వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్నాయి. గడిచిన మూడేళ్లుగా ఈ స్టాక్స్‌ బేరిష్‌గానే ఉన్నాయి. యూఎస్‌ఎఫ్‌డీఏ కఠినంగా వ్యవహరించడం, తనిఖీలు, అభ్యంతరాల పేరుతో భారత ఫార్మా కంపెనీలను బెంబేలెత్తించింది. అమెరికా మార్కెట్లో జనరిక్స్‌ ఔషధ ధరల పోటీ పరాకాష్టకు చేరుకుంది. అయితే, గత కొంత కాలంగా ఈ పరిస్థితులు కాస్త ఉపశమించాయి. అదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం... అమెరికా మార్కెట్లలో ఎక్కువ

బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌....పార్లమెంటు అనుమతి కోరిన కేంద్రం

Thursday 20th December 2018

రూ.41,000 కోట్ల అదనపు మూలధనం మూలధన ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం సాయమందించేందుకు రెడీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.41,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని అందించేందుకు పార్లమెంట్‌ అనుమతి కోరింది. 2017 అక్టోబర్‌లో ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల బెయిల్‌ఔట్‌ ప్యాకేజ్‌కి ఈ నిధులు అదనం. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం రోజు ఈ అదనపు నిధులకు సంబంధించి సప్లిమెంటరీ డిమాండ్‌

Most from this category