STOCKS

News


రూపాయి రికవరీతో రెండోరోజూ లాభాలే..!

Friday 7th September 2018
Markets_main1536315927.png-20063

11550 పైన నిఫ్టీ
రాణించిన అటో, మెటల్‌ ఫార్మా షేర్లు

మార్కెట్‌  వారంతపు రోజైన శుక్రవారం లాభంతో ముగిసింది. రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల దిగిరావడంతో సూచీలు రెండోరోజూ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 147 పాయింట్ల లాభంతో 38390 వద్ద ముగిసింది. మరో ప్రధాన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ ఇంట్రాడేలో 11603 వరకు ర్యాలీ చేసింది. చివరికి 52 పాయింట్ల లాభంతో 11550 పాయింట్లపైన 11589 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకు సూచీ తప్ప మిగిలిన రంగాలకు చెందిన సూచీలు లాభాలతో ముగిశాయి. అత్యధికంగా అటో ఇండెక్స్‌ 2.20శాతం లాభపడింది. కీలకమైన బ్యాంకు నిఫ్టీ 13 పాయింట్లు లాభంతో 27,481 వద్ద ముగిసింది.
లాభాలతో ప్రారంభమైనా.. క్షణాల్లో నష్టాల్లోకి...
బెంచ్‌మార్క్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.., క్షణాల్లో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 72 పాయింట్ల లాభంతో 38,314వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 11,558 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మన మార్కెట్‌ ప్రారంభం సమయానికి ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌.., గత రాత్రి అమెరికా మార్కెట్‌ మిశ్రమ ముగింపు, వచ్చే వారంలో ట్రంప్‌ వాణిజ్య సమస్యలపై జపాన్‌తో చర్చించనున్న నేపథ్యంలో మరోసారి వాణిజ్య యుద్ధభయాలు తెరపైకి రావడం తదితర అంశాలు మన సూచీలపై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సూచీలు ఆరంభ లాభాల్ని క్షణాల్లో కోల్పోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన అరగంటలోనే సెన్సెక్స్‌ 176 పాయింట్లను నష్టపోయి 38,067 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల నష్టపోయి 11,484 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.
రూపాయి రికవరీ-మళ్లీ లాభాల్లోకి:-
రోజురోజుకూ క్షీణిస్తున్న రూపాయిని స్థిరీకరించేందుకు రిజర్వ్‌ బ్యాంకు జోక్యం చేసుకుంటుందనే డీలర్ల అంచనాల నేపథ్యంలో ఇంట్రాడేలో రూపాయి బలపడింది. డాలర్‌ మారకంలో రూపాయి గతముగింపు స్థాయి(71.99)తో పోలిస్తే 21 పైసల వరకు లాభపడి 71.78 వరకు కోలుకుంది. దీనికితోడు అటోమొబైల్స్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన మిడ్‌క్యాప్‌ షేర్ల ర్యాలీ తోడవ్వడంతో సూచీలు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి.

మిడ్‌సెషన్‌ నుంచి మరింత దూకుడుగా:-
ఆసియా మార్కెట్ల నష్టాల కారణంగా మిడ్‌సెషన్‌ వరకు స్తబ్దుగా ట్రేడైన సూచీలు మిడ్‌సెషన్‌ అనంతరం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతునివ్వడంతో దూకుడును పెంచాయి. ఆసియా మార్కెట్ల నష్టాల ముగింపు, యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం మన మార్కెట్‌ను ప్రభావితం చేయలేకపోయాయి. మిడ్‌ సెషన్‌ అనతరం మెటల్‌ షేర్లు ర్యాలీ జరపడం...సూచీలకు మరింత ఉత్సాహానిచ్చింది. సెన్సెక్స్‌ 179 పాయింట్లను ఆర్జించి 38423 వద్ద, నిఫ్టీ సూచీ 66 పాయింట్ల లాభపడి 11600 మార్కును దాటి 11603 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నెలకొల్పాయి.
ఎం అండ్‌ ఎం, భారతీఎయిర్‌టెల్‌, లుపిన్‌, బజాజ్‌ అటో, హీరోమోటర్‌ కార్ప్‌ షేర్లు 4నుంచి 5.50శాతం లాభపడగా, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, అదానీపోర్ట్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2నుంచి 4.50శాతం లాభపడ్డాయి.You may be interested

స్టాక్‌ మార్కెట్లో సంపాదించడం ఈజీయేనా..?!

Saturday 8th September 2018

స్టాక్‌ మార్కెట్‌ అన్నది కష్టమైన రీతిలో సులభమైన డబ్బులను సంపాదించుకునే వేదిక అని కేడియా సెక్యూరిటీస్‌ ఎండీ విజయ్‌ కేడియా పేర్కొన్నారు. అయితే, ప్రపంచ స్థాయి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉందని ఎవరైనా ఈ విధంగా భావించడం సరికాదని సూచించారు. ‘‘అక్కడ ఎటువంటి గ్యారంటీ ఉండదు. నేను ఎంతో మంది విజయం సాధించిన సీఏలు, సీఈవోలను కలుసుకున్నాను. వారు తమ తమ రంగాల్లో ఎంతో విజయం సాధించిన వారు. ఎన్నో

షార్ట్‌టెర్మ్‌లో 11,800-12,000 స్థాయి కష్టమే..

Friday 7th September 2018

నిఫ్టీ సమీప కాలంలో 11,800-12,000 స్థాయిని చేరుకోలేకపోవచ్చని అజ్‌కాన్‌ గ్లోబల్‌ ఈక్విటీ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అకాశ్‌ జైన్‌ తెలిపారు. లార్జ్‌క్యాప్స్‌ వల్ల ఇండెక్స్‌లు బాగా పెరిగాయని పేర్కొన్నారు. ఎల్‌టీసీజీ అమలు తర్వాత బాగా కరెక‌్షన్‌కు గురైన మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ ఆమోదయోగ్యమైన వ్యాల్యుయేషన్స్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏఎస్‌ఎం అమలు, ఎఫ్‌పీఐలపై సెబీ సర్క్యులర్‌ వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు

Most from this category