STOCKS

News


10,200 దిగువకు నిఫ్టీ

Tuesday 30th October 2018
Markets_main1540896034.png-21589

34000ల దిగువకు సెన్సెక్స్‌
ట్రేడింగ్‌ ఆరంభం నుంచి ఒడిదుడుకులతో సాగిన మార్కెట్‌ ట్రేడింగ్‌ను మిడ్‌సెషన్‌ అనంతరం జరిగిన అమ్మకాలు ముంచేశాయి. ఫలితంగా మార్కెట్‌ లాభాలు ఒక్కరోజుకే పరిమితయ్యాయి. ముఖ్యంగా హెవీ వెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌ ద్వయం, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌ షేర్ల పతనంతో సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 176 పాయింట్ల కోల్పోయి 33, 891వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల నష్టపోయి 10,198 వద్ద ముగిశాయి. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తెరపైకి రావడం, యూరప్‌ మార్కెట్ల మిశ్రమ ప్రారంభం, నేటి మార్కెట్లో ట్రేడింగ్‌ సమయంలో ఫలితాలు ప్రకటించిన పలు కార్పోరేట్ సంస్థల ఫలితాలు మిశ్రమంగా ఉండటం తదితర ప్రతికూలాంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు క్రితం ట్రేడింగ్‌లో అందుకున్న 34వేల, 10200 పాయింట్ల కీలక స్థాయిలను కోల్పోయాయి. మరో కీలక సూచి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 150 పాయింట్లు కోల్పోయి 24807 వద్ద ముగిసింది. మెటల్‌, ప్రైవేట్‌ బ్యాంక్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఫార్మా ఇండెక్స్‌లు నష్టాల్లో ముగిశాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఐటీ, అటో, రియల్టీ, మీడియా రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడగా, మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 1.50శాతం నష్టపోయింది.
ఫ్లాట్‌ ఓపెనింగ్‌:-
అమెరికా మార్కెట్ల పతనంతో మిశ్రమ ఆసియా మార్కెట్ల ట్రేడింగ్‌ను అందుకున్న మన మార్కెట్‌ నేటి ట్రేడింగ్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 2 పాయింట్ల లాభంతో 34,069 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 10,239 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో పెట్రోమార్కెటింగ్‌ షేర్ల పతనంతో సెన్సెక్స్‌ 100 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 10,250 మార్కును కోల్పోయింది. అయితే ఈ దశలో గత ట్రేడింగ్‌లో మార్కెట్‌ను ముందుండి నడిపించిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌కు కూడా ప్రాతినిథ్యం వహించడంతో సూచీలు లాభాల ర్యాలీ చేశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ సూచీ 109 పాయింట్లు లాభపడి 34,176 వద్ద, నిఫ్టీ సూచీ 34 పాయింట్లు పెరిగి 10,285 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది. పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల ర్యాలీకి మార్కెట్‌లో ఇతర షేర్ల నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో క్రమంగా సూచీలు లాభాలను కోల్పోతూ వచ్చాయి.  
మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాల పర్వం:-
మిడ్‌సెషన్‌ అనంతరం ఇన్వెస్టర్లు అమ్మకాలను మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. దీనికి తోడు చైనా-అమెరికా దేశాల వాణిజ్య యుద్ధ అంశం మరోసారి తెరపైకి రావడం కూడా కూడా ఇన్వెస్టర్లను ఆందోళనలు రేకెత్తించాయి. ఈ క్రమంలో ఓ దశలో సెన్సెక్స్‌ సూచీ 267 పాయింట్లను కోల్పోయి 33,800 వద్ద, నిఫ్టీ సూచీ 85 పాయింట్లు నష్టపోయి 10,175 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. చివరకు నిఫ్టీ 10198 వద్ద, సెన్సెక్స్‌ 33,891ల వద్ద ముగిశాయి.

ఐఓసీ, సిప్లా, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 3.50శాతం నుంచి 4.50శాతం నష్టపోగా, గెయిల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసీం, జీ లిమిటెడ్‌, టెక్‌ మహీంద్రా షేర్లు 2.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి.



You may be interested

ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్‌.. ఇన్వెస్ట్‌ చేయొచ్చు: ఐఐఎఫ్‌ఎల్‌

Tuesday 30th October 2018

ఇటీవలి మార్కెట్‌ కరెక్షన్‌లో పలు విలువైన షేర్లు చౌకగా లభిస్తున్నాయని, నాణ్యమైన షేర్లను ఎంపికచేసుకుని, పెట్టుబడి చేసేందుకు ఇది తరుణమని ఐఐఎఫ్‌ఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (రీసెర్చ్‌) అభిమన్యు అంటున్నారు. ఆయన ఒక ఆంగ్లచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూ అంశాలు.... మనీ మార్కెట్‌ కారణం... ఇటీవలి భారీ పతనానికి మనీ మార్కెట్లో ఏర్పడ్డ సంక్షోభమే ప్రధాన కారణమని,ఇప్పుడా మార్కెట్లో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడినందున స్టాక్‌ మార్కెట్‌పై సానుకూల ప్రభావం ప్రసరించిందన్నారు.

నిఫ్టీ టార్గెట్‌ 10,380–10,600 శ్రేణి

Tuesday 30th October 2018

స్వల్పకాలానికి మార్కెట్‌ బాటమ్‌అవుట్‌ అయ్యిందని, 10,380–10,600 శ్రేణికి క్రమేపీ పెరిగే ఛాన్స్‌ వుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ సూచిస్తున్నారు. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు వారి షార్ట్‌ పొజిషన్ల నుంచి వైదొలిగి 10,004 పాయింట్ల స్టాప్‌లాస్‌తో నిర్దేశిత లక్ష్యానికి లాంగ్‌ పొజిషన్లు క్రియేట్‌ చేసుకోవొచ్చని సిఫార్సుచేశారు. గతవారం మార్కెట్‌ క్షీణించినప్పటికీ, డౌన్‌ట్రెండ్‌ మూమెంటమ్‌ నెమ్మదించిందని, 100 వారాల మూవింగ్‌ ఏవరేజ్‌ కదులుతున్న 10,000 పాయింట్ల సమీపంలో నిఫ్టీ మద్దతుపొంది, పెద్ద ర్యాలీ

Most from this category