STOCKS

News


లాభాలు ఒక్కరోజుకే పరిమితం

Wednesday 15th May 2019
Markets_main1557915792.png-25760

ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరి గంటలో అమ్మకాలదే పైచేయి కావడంతో బుధవారం నష్టాలతో ముగిశాయి. ఫలితంగా మార్కెట్‌ లాభాలు ఒకరోజుకే పరమితమయ్యాయి. సెన్సెక్స్‌ 203 పాయింట్లను నష్టపోయి 37,114.88 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 65 పాయింట్లను కోల్పోయి 11,157 వద్ద ముగిసింది. తొమ్మిదిరోజుల వరుస నష్టాల అనంతరం క్రితం రోజు మార్కెట్‌ లాభాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఈ రోజు తీవ్ర నష్టాల్నిచవిచూసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న సాదారణ ఎన్నికలు, చైనా-అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న వాణజ్య యుద్ధ భయాలు, ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం తదితర కారణాలు మార్కెట్‌ అస్థిరతకు కారణమని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. డాలర్‌ మారకంలో రూపాయి బలపడటంతో ఒక్క ఐటీ రంగ షేర్లలో తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు జరిగాయి. అ‍త్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, అటో రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 213 పాయింట్లు(0.75శాతం) నష్టపోయి 28,616.45 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,048 - 37,559 స్థాయిలోనూ, నిఫ్టీ 11,137  - 11,287 శ్రేణిలో కదలాడాయి. 
ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, జీ లిమిటెడ్‌, టాటామోటర్స్‌, యస్ బ్యాంక్‌ షేర్లు 4శాతం నుంచి 8.50శాతం నష్టపోగా, ఐఓసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యూపీఎల్‌, ఐషర్‌మోటర్స్‌, బజాజ్‌ఫైనాన్స్‌ షేర్లు 1శాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

టాటామోటర్స్‌ 8శాతం పతనం

Wednesday 15th May 2019

టాటామోటర్స్‌ షేర్లు బుధవారం 8శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.185.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అటోరంగ షేర్ల పతనంలో భాగంగా నేడు షేరు 9శాతానికి పైగా నష్టపోయి రూ.167.50ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 8శాతం నష్టంతో 169.60 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్‌ఈలోని నిఫ్టీ - 50 సూచీలోని టాప్‌-5 లూజర్లలో ఈ షేరు రెండోస్థానంలో ముగిసింది. 

యూనియన్‌ బ్యాంక్‌ క్రాష్‌

Wednesday 15th May 2019

ప్రభుత్వరంగ బ్యాంక్‌ యూనియన్‌ బ్యాంక్‌ ఇండియా(యూబీఐ) షేర్లు బుధవారం ట్రేడింగ్లో పదిశాతం పతనయ్యాయి. గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసిక ఫలితాల్లో నష్టాలను ప్రకటించడంతో పాటు ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు షేరు కొనుగోలు ధరను తగ్గించడం ఇందుకు కారణం. నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.75.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మొండిబకాయిలకు అధిక కేటాయింపుల కారణంగా కంపెనీ గతేడాది చివరి త్రైమాసికంలో రూ.3,370 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. మొండి

Most from this category