News


మార్కెట్‌కు ‘‘ఆర్‌బీఐ పాలసీ’’ షాక్‌

Friday 5th October 2018
Markets_main1538735230.png-20898

  • 792 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌
  • 283 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

కీలక వడ్డీరేట్లపై ఆర్‌బీఐ యథాతధ పాలసీ ప్రకటనతో పాటు​ఆయిల్‌రంగ షేర్ల భారీ పతనంతో మార్కెట్‌ మూడో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 792 పాయింట్లు నష్టపోయి 34,377 వద్ద, నిఫ్టీ సూచి 283 పాయింట్ల నష్టంతో 10,316 వద్ద ముగిశాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మార్కెట్లో నెలకొన్న అమ్మకాల పరంపరలో భాగంగా సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 964 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 337 పాయింట్లను నష్టపోయింది. అయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై లీటరుకు రూ.1.00ల వరకు భారాన్నీ భరించాల్సి ఉంటందనే ప్రకటనతో కారణంగా నేటి ట్రేడింగ్‌లో అత్యధికంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నష్టపోయాయి.
ఆర్‌బీఐ యథాతధ పాలసీ విధానంతో రూపాయి మరింత బలహీపడి తొలిసారి 74స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఐటీ షేర్ల స్వల్పంగా లాభపడ్డాయి.  
ఎన్‌ఎస్‌ఈలో ఒక్క ఐటీ తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాలతో ముగిశాయి. అ‍త్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంకు ఇండెక్స్‌ 4.50శాతం నష్టపోయింది. కీలకమైన బ్యాంకు నిఫ్టీ సూచి 375 పాయింట్ల నష్టపోయి 24,443.45 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 34,202.22 - 35,097.99 స్థాయిలో కదలాడగా, నిఫ్టీ సూచి 10,261.90 - 10,540.65 రేంజ్‌లో​ట్రేడైంది.
అడుగంటిన​ ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు:-
పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైంజ్‌ సుంకాలన్ని కేంద్రం లీటర్‌కు రూ.1.50, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రూ.1.00ల భరించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటనతో శుక్రవారం ట్రేడింగ్‌లోనూ ఆయిల్‌ మార్కెటింగ్‌ ప్రధాన కంపెనీలైన బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌, ఐఓసీ, ఓఎన్‌జీసీ షేర్లు 28శాతం నష్టపోయాయి. ఓఎన్‌జీసీ ఆరేళ్ల కనిష్టానికి, బీపీసీఎల్‌ రెండున్నరేళ్ల కనిష్టానికి, ఐఓసీ రెండేళ్ల కనిష్టానికి, హెచ్‌పీసీఎల్‌ ఏడాదిన్నర కనిష్టానికి చేరుకున్నాయి. మార్కెట్‌ ముగిసేసమయానికి నిఫ్టీ -50 సూచీలోని టాప్‌-5 లూజర్లలో అన్ని షేర్ల ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు కావడం గమనార్హం.
ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతధం:-
మార్కెట్‌ వర్గాల అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ ద్రవ్యపాలసీని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లపై ‘‘స్టేటస్‌ కో’’ విధానాన్నే కొనసాగిస్తున్నట్లు కమిటి తెలిపింది. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజుల భేటీ  అనంతరం  ద్రవ్యవిధాన కమిటీ వడ్డీరేట్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించింది. మానిటరీ పాలసీ కమిటిలో నలుగురు సభ్యులు యథాతధ పాలసీకే ఓటు వేసారు.
74 స్థాయికి రూపాయి:-
నేడు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం 73.64 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరలు, డాలర్‌ వడ్డీ బలపడంతో ఎప్పటికప్పుడు కొత్త కనిష్టాలను నమోదుచేస్తున్న రూపాయి ఫెడ్‌ కీలకవడ్డీ రేట్లపై యధాతథ పాలసీని కొనసాగించడంతో తాజాగా మరో కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. తొలిసారిగా డాలర్‌ మారకంలో రూపాయి తొలిసారి 74స్థాయికి చేరుకుంది.   
అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు:-
అమెరికా పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ ఏడేళ్ల గరిష్టానికి చేరుకోవడం పాటు, నేడు ఆ దేశ ఉద్యోగ గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమతత్త కారణంగా అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా గత రాత్రి అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మన మార్కెట్‌ ముగింపు సమయానికి ఆసియా మార్కెట్ల నష్టాల ముగింపు, యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం మన మార్కెట్‌ మరో ప్రతికూలాంశంగా మారాయి.  
గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 9శాతం నుంచి 24శాతం నష్టపోగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌, ఇన్ఫ్రాటెల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి.You may be interested

విదేశీ ఇన్వెస్టర్లు దీర్ఘకాలానికి సానుకూలమే: మార్క్‌మోబియస్‌

Saturday 6th October 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం విదేశీ ఇన్వెస్టర్లు కలవరపరిచే అంశంగా ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు మార్క్‌ మోబియస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వార్తా పత్రికకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నవి, భారత్‌లో అదే తరహా ఇతర కంపెనీలు కూడా భారీ రుణాలపైనే నడుస్తున్నట్టు ఇన్వెస్టర్లకు తెలియజేస్తోందన్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల కెరటాల మాదిరి ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. ఇతర దేశాలు

మారుతీ సుజుకీ... మహా పతనం ఎందుకు?

Friday 5th October 2018

36 రోజుల్లో 26 శాతం క్షీణించిన షేరు దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ షేరు గత నెల రోజులుగా భారీ కరెక‌్షన్‌లోకి జారుకుంది. ఆగస్టు 28న 9400 రూపాయల వద్ద ఉన్న మారుతీ షేరు ధర అక్టోబర్‌ 5 నాటికి 6900 రూపాయలకు దిగివచ్చింది. అంటే దాదాపు నెల రోజుల్లో సుమారు 26 శాతం క్షీణించింది. బ్రోకరేజ్‌లు మెచ్చిన మారుతీ షేరు ఇంతలా పతనం కావడం రిటైల్‌ ఇన్వెస్టర్లను

Most from this category