STOCKS

News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 11th February 2019
Markets_main1549857657.png-24118

10,900 దిగువన నిఫ్టీ ప్రారంభం

ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల నేపథ్యంలో సోమవారం దేశీయ మార్కెట్‌ మిశ్రమంగా ప్రారంభమైంది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10,900 పాయింట్ల దిగువన ప్రారంభంకాగా,  సెన్సెక్స్‌ 130 పాయింట్లు నష్టంతో 36,416 పాయింట్ల వద్ద మొదలైంది. ఎఫ్‌ఎంజీసీ, అటో, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఫార్మా,  షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు మెటల్‌, మీడియా షేర్లలో స్వల్పంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. 
నిఫ్టీ - 50 ఇండెక్స్‌లో గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఇన్ఫోసిస్‌, జీలిమిటెడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సిప్లా, టాటాస్టీల్‌ షేర్లు అరశాతం నుంచి 2శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 11th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు భారతీ ఎయిర్‌టెల్‌:- కెన్యా ఎయిర్‌టెల్‌ విభాగం ఆఫ్రికాలోని టెలికామ్‌ కెన్యా కంపెనీ విలీనం చేసుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- జీనియస్‌ కలర్స్‌ కంపెనీలో 9.50శాతం వాటాను రూ.45 కోట్లకు తన అనుబంధ రిలయన్స్‌ రీటైల్‌ వెంచర్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ హైదరాబాద్‌లోని బూచుపల్లి ఫార్మేషన్‌ యూనిట్‌-3లో తనిఖీలను పూర్తి చేసింది. లుపిన్‌:- గోవా యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ 2రెండు అబ్జర్వేషన్లలతో కూడిన 483-ఫామ్‌ను

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిప్టీ

Monday 11th February 2019

విదేశీ మార్కెట్లో  ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం గం.8:50ని.లకు 10,930.00 వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి పోలిస్తే 27పాయింట్ల నష్టంతో ఉంది. అందువల్ల నిఫ్టీ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియాలో చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, హాంగ్‌కాంగ్‌ మార్కెట్ల లాభాల్లో ఉండగా, మిగిలిన మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికా,

Most from this category