STOCKS

News


నష్టాలతో ప్రారంభం

Monday 4th February 2019
Markets_main1549253951.png-23993

రెండురోజుల వరుసగా ర్యాలీకి స్వస్తి పలుకుతూ సోమవారం దేశీయ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ గత ముగింపు(36,469)తో పోలిస్తే 13పాయింట్లను కోల్పోయి 36,456 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ గతముగింపు(10,893)తో పోలిస్తే నిఫ్టీ 17పాయింట్ల నష్టంతో 10,876.75 వద్ద ప్రారంభమైంది. డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. అలాగే బడ్జెట్‌ సందర్భంగా గత ట్రేడింగ్‌లో భారీగా లాభపడిన అటో రంగషేర్లలో అమ్మకాలు ఎ‍క్కువగా ఉన్నాయి. బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లలో సైతం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు  రూపాయి బలహీనత ఐటీ, ఫార్మా షేర్లకు కలిసొస్తుంది. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 89 పాయిం‍ట్ల 36,380 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 30 పాయింట్ల నష్టంతో 10.868 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  
ఇదే సమయానికి నిఫ్టీ -50 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌పీసీఎల్‌, జీ లిమిటెడ్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2నుంచి 3శాతం నష్టపోగా, ఇండియాబుల్‌ హౌసింగ్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఓఎన్‌జీసీ, టైటాన్‌ షేరు 1శాతం నుంచి 3.50శాతం లాభపడింది.

 36పైసలు నష్టపోయిన రూపాయి:-
శుక్రవారం కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రజాకర్షక ఫథకాలు ప్రవేశపెట్టడంతో రానున్న రోజుల్లో ద్రవ్యలోటు పెరగవచ్చనే ఆందోళనతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ తీవ్రంగా నష్టపోయింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ వారం గరిష్టానికి చేరుకోవడం కూడా డాలర్‌ మారకంలో రూపాయి బలహీనతకు కారణమైంది. చివరి రోజుల భారీగా పెరగడంతో  ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 35 పైసలు (0.5 శాతం) క్షీణించి 71.60 వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.9:30ని.లకు డాలర్‌ మారకంలో 40 పైసలు పతనమై 71.65 వద్ద ట్రేడవుతోంది.

 



You may be interested

ఆర్‌కామ్‌ 48 శాతం క్రాష్‌

Monday 4th February 2019

అనిల్‌ అంబానీ నేతృత్వంలోని టెలికాం సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సోమవారం ట్రేడింగ్‌ ప్రారభంలోనే ఏకంగా 48శాతం నష్టపోయింది. దివాళా పరిష్కార ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రెబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించడం ఇందుకు కారణం. ఆస్తులను విక్రయించేందుకు రుణదాతల నుంచి 100శాతం అనుమతులు రాకపోవడంతో  దివాలా పిటిషన్‌ ద్వారా ఎన్‌సీఎల్‌టీ మార్గంలోనైనా రుణ పరిష్కార ప్రక్రియకు ఆమోదం తీసుకోవాలని ఆర్‌కామ్ భావిస్తున్నట్లు శుక్రవారం వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నేడు బీఎస్‌ఈలో కంపెనీ

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 4th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు టెక్‌ మహీంద్రా:- నెదర్లాండ్‌ కంపెనీ డైనోకామర్స్‌ను 4.39 మిలియన్‌ యూరోలకు కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:- రుణాల పరిష్కారానికి సంబంధించిన గతంలో రూపొందించిన ప్రణాళిక తరహా ప్రతిపాదననే ఎన్‌సీఎల్‌టీ ముందు కూడా ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఈద్‌ ప్యారీ:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో కంపెనీ రూ.250 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌:- డిజిటల్‌

Most from this category