STOCKS

News


భారీ నష్టంతో ఆరంభం

Monday 22nd April 2019
Markets_main1555907144.png-25255

మూడు రోజుల విరామం అనంతరం ప్రారంభమైన మార్కెట్‌ సోమవారం భారీ నష్టంతో ప్రారంభమైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్యాంకింగ్‌, అటో షేర్ల పతనం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్లు పతనమైన 39, 040 వద్ద నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 11,727.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈవారంలో పలు కీలక కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను ప్రకటించనుండం, సాదారణం ఎన్నికల్లో భాగంగా రేపు(మంగళవారం) పలు రాష్ట్రాల్లో​3వ విడుతలో 116 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రవహిస్తున్నారు. మరోవైపు ఇరాన్‌ నుంచి దిగుమతి అవుతున్న క్రూడాయిల్‌ పై సుంకాలు విధింపునకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు 6నెలల గరిష్టానికి చేరుకోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరించింది. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 40 పైసలు నీరసించి 69.75 వద్ద ప్రారంభం కావడం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఫలితంగా ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 256 పాయింట్ల నష్టంతో 38,884.18 వద్ద, నిఫ్టీ 96.35 పాయింట్లను కోల్పోయి 11,656.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి బలహీనతతో ఒక్క ఐటీ షేర్లు తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా అటో, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 
రిలయన్స్‌ ఇండస్టీ‍్రస్‌, ఇండియన్‌బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌, ఐఓసీ, బీపీసీఎల్‌ షేర్లు 2శాతం నుంచి 4.50శాతం నష్టపోగా, హెచ్‌సీఎల్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం లాభపడ్డాయి.You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 22nd April 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఎల్‌ అండ్‌ టీ:- ఎలక్ట్రానిక్స్‌, అటోమెషన్‌ రంగంలో సేవలు అందించే సచీంద్ర అండ్‌ మాక్రితి విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది. స్పైస్‌ జెట్‌:- విమానయాన రంగంలో కీలకమైన సాంకేతిక కోడ్‌లను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఎమిరేట్స్‌ కంపెనీతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  బోరోసిల్‌ గ్లాస్‌వర్క్స్‌:- అనుబంధ సంస్థ క్లాస్‌ప్యాక్‌లో అదనంగా రూ.5 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనుంది.  మెజెస్కో:- క్లౌడ్‌ రంగంలో తన సేవలను విస్తరించుకునేందుకు రెడీ-టు-యూజ్‌ యాప్‌ను

పంచదార స్టాక్స్‌తో ఎల్‌ఐసీకి లాభాల మిఠాయి

Sunday 21st April 2019

వ్యాల్యూ ఇన్వెస్టర్‌ అనిల్‌కుమార్‌ గోయల్‌, ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ పంచదార స్టాక్స్‌లో పెట్టుబడులతో భారీ లాభాలను మూటగట్టుకున్నాయి!. గతేడాది షుగర్‌ స్టాక్స్‌లో గోయల్‌ అదే పనిగా పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు, బ్రెజిల్‌లో ఉత్పత్తి తగ్గడం పంచదార స్టాక్స్‌ ఫిబ్రవరి-మార్చి మధ్య ర్యాలీ జరపడానికి కారణమయ్యాయి. 26 షుగర్‌ కంపెనీల్లో 22 కంపెనీలు 40 శాతం వరకు పెరిగాయి. అయితే అంతకుముందు అంటే 2018

Most from this category