STOCKS

News


స్వల్ప లాభాలతో ప్రారంభం

Tuesday 19th February 2019
Markets_main1550552682.png-24252

మిశ్రమ అంతర్జాతీయ ఫలితాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం స్వల్పలాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 55 పాయిం‍ట్ల లాభంతో 35,543 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 10650ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు స్వల్పంగా కొనుగోళ్లకు మొగ్గుచూపుతుండంతో సూచీల లాభాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఐటీ, ఫార్మా తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు జరుగుతున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌ షేర్లు ఎక్కువగా లాభపడుతున్నాయి. ఉదయం గం.9:40ని.లకు సెన్సెక్స్‌ 92 పాయింట్లు పెరిగి 35,590కు చేరింది. నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 10,662 వద్ద ట్రేడవుతోంది. 

-    అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుదల కారణంగా దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో పాయి బలహీనంగా ప్రారంభమైంది. నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ 8పైసలు బలహీనపడి 71.30 వద్ద ప్రారంభమైంది. 

-    అగ్రరాజ్యాలైన యూఎస్‌, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారంపై అంచనాలతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. ప్రెసిడెంట్ డే సందర్భంగా సోమవారం అమెరికా మార్కెట్లకు సెలవు.

టెక్‌మహీంద్రా, విప్రో, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం నష్టపోగా, ఎంఅండ్‌ఎం, టైటాన్‌, బజాజ్‌ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి.You may be interested

నోట్లరద్దు సమాచారం రహస్యమా?

Tuesday 19th February 2019

ఆర్‌బీఐని తప్పుబట్టిన కేంద్ర సమాచార కమిషన్‌ పొరపాటున అలా చెప్పామన్న రిజర్వు బ్యాంకు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ఆర్‌బీఐ బోర్డు సమావేశమై ఏం చర్చించిందనేది వెల్లడించడానికి నిరాకరించడాన్ని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) తప్పుబట్టింది. ఇదే విషయమై సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌కు సైతం షోకాజు నోటీసు జారీ చేసింది. డీమోనిటైజేషన్‌ నిర్ణయానికి ముందు... అందుకు సంబంధించి జరిగిన ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం వివరాలు,

ఈ పతనం ఎటు వైపు...?

Monday 18th February 2019

మార్కెట్లు వరుసగా ఏడు రోజులు నష్టపోయాయి. నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను దిగొచ్చింది. ఈ పతనం ఎంత వరకు...? గత కనిష్టాలకు వెళుతుందా? ఇలా ఎన్నో సందేహాలు ఇన్వెస్టర్లలో ఉన్నాయి. దీనికి నిపుణులు ఏం చెబుతున్నారన్నది చూద్దాం...   ప్రస్తుత పరిస్థితి: ఈ ఏడాది ఇప్పటి వరకు చమురు ధరలు 50 శాతం పెరిగాయి. డిసెంబర్‌ 2018 త్రైమాసికం ఫలితాలు నిరాశపరిచాయి. ప్రస్తుత కరెక్షన్‌కు కారణం ఇదే. ఐటీ స్టాక్స్‌ ఈ ఏడాది

Most from this category