News


10900పైన ప్రారంభమైన నిఫ్టీ

Monday 31st December 2018
Markets_main1546229398.png-23320

ప్రపంచ‌మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో దేశీయ మార్కెట్‌ సోమవారం భారీ లాభాల్లో ట్రేడ్‌ అయ్యింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం సైతం సూచీల లాభాల ప్రారంభానికి దోహదపడింది. ప్రధాన సూచీలైన ప్రధాన సూచీలైన నిఫ్టీ సూచీ 63 పాయింట్ల లాభంతో 10900లపై 10,923.55 వద్ద సెన్సెక్స్‌ 163 పాయింట్ల లాభంతో 36,239.19 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలకు ఇది వరుసగా నాలుగోరోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే సూచీలు తమ లాభాలను కోల్పోయాయి. ఉదయం గం.9:25 ని.లకు సెన్సెక్స్‌ 82.65 పాయింట్ల లాభంతో 36,159.37 వద్ద, నిఫ్టీ సూచీ 27.2 పాయింట్లు పెరిగి 10,887.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంక్‌, అటో షేర్లలో ర్యాలీ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ దాదాపు అరశాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది.

బజాజ్‌ ఫైనాన్స్‌, జీ మీడియా, ఐఓసీ, సన్‌ఫార్మా, టైటాన్‌ షేర్లు 2శాతం నుంచి 4శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఏషియన్‌ పేయింట్స్‌, జజాజ్‌ అటో, టీసీఎస్‌, బీపీసీఎల్‌, ఇన్రా‍్ఫటెల్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

స్థూల ఆర్థిక గణాంకాలతోనే దిశా నిర్దేశం..

Monday 31st December 2018

సోమవారం మౌలిక రంగ ఉత్పత్తి డేటా ఈవారంలోనే నికాయ్‌ గణాంకాల వెల్లడి ముడిచమురు, రూపాయి కదలికలపై దృష్టి నవంబర్‌ ఆటో అమ్మకాల డేటా ఈవారంలోనే.. ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ముడిచమురు, రూపాయి కదలికల ఆధారంగా నూతన ఏడాది మొదటివారం ట్రెండ్‌ ఆధారపడి ఉందని చెబుతున్నారు. ‘భూగోళ రాజకీయా అంశాలు, అధిక స్థాయిల వద్ద కొనసాగుతున్న

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 31st December 2018

ప్రపంచ‌మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో సోమవారం  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం ఉదయం 9.00 గంటల సమయానికి 39 పాయింట్ల పెరుగుదలతో 10,960 పాయింట్ల వద్ద ట్రేడవుతుంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10921.50 పాయింట్లతో పోలిస్తే 39 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు నేడు ఆసియా

Most from this category