STOCKS

News


ప్రారంభం ఫ్లాట్‌

Tuesday 4th December 2018
Markets_main1543896220.png-22601

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సాంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం మిశ్రమంగానే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో 36,290.48 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 10,877.10మ వద్ద ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ర్యాలీ చేయడంతో క్రితం రోజు ట్రేడింగ్‌లో 88పైసలు నష్టపోయి రూపాయి నేటి ట్రేడింగ్‌లో స్వల్పంగా బలహీనపడి సూచీలను వెనక్కిలాగుతుంది. అలాగే హెవీవెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, మహీం‍ద్రా అండ్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్ షేర్లు పతనం సూచీలను నష్టాల్లోనెట్టింది.  ఉదయం గం.9:20ని సెన్సెక్స్‌ 98 పాయింట్ల నష్టంతో 36,142.44 వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 10,862 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫార్మా, మెటల్‌, ఐటీ ఇండెక్స్‌లు స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌రంగ, రియల్టీ రంగ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.
ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఓఎన్‌జీసీ షేర్లు 1.50శాతం నుంంచి 1.75శాతం లాభపడ్డాయి. భారతీఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎం అండ్‌ ఎం షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

5 పైసలు బలహీనపడిన రూపాయి

Tuesday 4th December 2018

డాలరుతో 70.51 వద్ద ప్రారంభం సోమవారం ముగింపు 70.46 ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభ సమయంలో స్వల్ప నష్టాలను నమోదుచేసింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 70.51 దగ్గర ప్రారంభమయ్యింది. 9 గంటల 15 నిమిషాల సమయానికి రికవరీ సాధించి 0.02 శాతం లాభాల్లో ట్రేడవుతోంది. ఈ సమయానికి 70.44 వద్ద ఉంది. ద్రవ్య, పరపతి విధాన నిర్ణయానికి సంబంధించి ఆర్‌బీఐ మూడు

క్యూ2 జీడీపీలో ఆశ్చర్యం కలిగించే అంశాలు

Tuesday 4th December 2018

సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైంది. అంతకుముందు జూన్‌ త్రైమాసికంలో 8.2 శాతం నుంచి ఒకే సారి గణనీయంగా తగ్గుదల నమోదైంది. డీమోనిటైజేషన్‌ తర్వాత గరిష్ట వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలోనే సాధ్యమైంది. గత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌ క్వార్టర్లో నమోదైన 6.3 శాతం వృద్ధి రేటుపైనే నమోదవడం కాస్త ఊరట. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కువ వృద్ధి రేటు

Most from this category