STOCKS

News


నిఫ్టీ రికార్డు ముగింపు

Tuesday 24th July 2018
Markets_main1532428275.png-18619

ముంబై:- మెటల్‌, ఫార్మా, ఐటీ షేర్ల మద్దతుతో మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. ఎల్‌ అండ్‌ టీ, గ్రాసీం, ఆదిత్యా బిర్లా గ్రూప్‌ షేర్ల అండతో సెన్సెక్స్‌ మరో నూతన గరిష్టస్థాయిని నమోదు చేసింది. మరో సూచి నిఫ్టీ ముగింపులో కొత్త రికార్డును సృష్టించింది. మిడ్‌ సెషన్‌ అనంతరం బ్యాంకు షేర్లలో అమ్మకాలు నెలకొన్నా, చివరి గంటలో కొనుగోళ్లకు మద్దతు లభించడంతో సూచీలు వరుసగా మూడోరోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 106 పాయింట్ల లాభంతో 36,825 వద్ద, నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో 11,134 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి 29న నిఫ్టీ రికార్డు ముగింపుస్థాయి అయిన 11,130పాయింట్లపైన తాజాగా ముగిసి కొత్త రికార్డును నెలకొల్పింది. అయితే ఈ సూచీ ఇంకా 11,171 పాయింట్ల చరిత్రాత్మక గరిష్టస్థాయిని ఇంకా అందుకోవాల్సివుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 192 పాయింట్ల రేంజ్‌లో కదలాడి 36710 - 36902 స్థాయిలో ట్రేడ్‌ కాగా, మరో ప్రధాన సూచి నిఫ్టీ ఇండెక్స్‌ 51పాయింట్ల స్థాయిలో 11,092 - 11,143 రేంజ్‌లో కదలాడింది.  ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంకు, ఐటీ, నిఫ్టీ బ్యాంక్‌, ఎఫ్‌ఎంజీసీ సూచీలు నష్టాలతో ముగియగా, మిగతా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా మెటల్‌ ఇండెక్స్‌ 3శాతం లాభపడింది.
బజాజ్‌ అటో, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, హీరోమోటర్‌ కార్పో, కోటక్‌ బ్యాంకు షేర్లు 1నుంచి 2శాతం నష్టపోగా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో, గ్రాసీం షేర్లు 3నుంచి 8శాతం లాభపడ్డాయి.

 



You may be interested

ఈ రంగాల స్టాక్స్‌ కొనొచ్చు..

Tuesday 24th July 2018

ఇన్వెస్టర్లు స్వల్పకాలంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అబకాస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫౌండర్‌ సునీల్‌ సింఘానియా. భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధం, కరెన్సీ యుద్ధం వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లోనూ అవకాశాలున్నాయంటున్నారు. మార్కెట్‌ లైఫ్‌ సైకిల్‌లో భాగంగా మిడ్‌ క్యాప్స్‌లో హెచ్చుతగ్గులు ఉన్నాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ సానుకూలతల నేపథ్యంలో సెప్టెంబర్‌ 30 వరకు కొన్ని రంగాల స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. అవేంటో చూద్దాం..    సిమెంట్‌ సిమెంట్‌

2 నెలలు.. 17 శాతం రాబడి..

Tuesday 24th July 2018

వచ్చే 1-2 నెలల్లో 6-17 శాతం రాబడులను అందించే ఐదు స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ డేరివేటిక్స్‌ అండ్‌ టెక్నికల్స్‌ హెడ్‌ అశిష్‌ చతుర్‌మెహ్‌తా.  ఆ సిఫార్సులివే... మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుత ధర: రూ.9,701 స్టాప్‌ లాస్‌: రూ.9,400 టార్గెట్‌ ప్రైస్‌: రూ.10,700 రాబడి అంచనా: 10.3 శాతం ఈ స్టాక్‌ లాంగ్‌ టర్మ్‌ అప్‌ట్రెండ్‌లో ఉంది. హైయర్‌ టాప్స్‌, హైయర్‌ బాటమ్స్‌ను ఏర్పాటు చేస్తుంది. 2017 డిసెంబర్‌లో రూ.9,996 గరిష్ట స్థాయిని తాకింది.

Most from this category