STOCKS

News


మరో నష్టాల ముగింపు.!

Wednesday 5th December 2018
Markets_main1544004868.png-22669

ప్రపంచ మార్కెట్ల క్షీణత, ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ బుధవారం భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 250 పాయింట్లు నష్టపోయి 35,884 వద్ద ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు కోల్పోయి 10,785 వద్ద ముగిశాయి. నష్టాల ముగింపు వరుసగా ఇది రెండో రోజు.  ప్రపంచమార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలు, రూపాయి నష్టాల ట్రేడింగ్‌తో గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన మార్కెట్‌ వడ్డీరేట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో మిడ్‌సెషన్‌ సమయాని కల్లా సెన్సెక్స్‌ 36వేల మార్కును కోల్పోగా, నిఫ్టీ 10800 స్థాయిని చేజార్చుకుంది. అనంతరం వడ్డీరేట్లు ‘‘యధాతథం’’ అనే ప్రకటనతో అమ్మకాలు మరింత పెరిగాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 356 పాయింట్లను కోల్పోయి 35,777.81 వద్దకు, నిఫ్టీ 121 పాయింట్లు నష్టపోయి 10748 స్థాయిని వద్ద ఇంట్రాడే కనిష్టాలకు చేరుకున్నాయి. చివరి అరగంటలో కొంత షార్ట్‌ కవరింగ్‌ జరగడంతో సూచీలు కొంతమేర నష్టాలను పూడ్చుకోగలిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్ల పతన ప్రభావం దేశీయంగా మెటల్‌ షేర్లపై పడింది. ఫలితంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3.50శాతం నష్టపోయింది. వడ్డీరేట్లపై ఆర్‌బీఐ ప్రకటన నేపథ్యంలో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 159 పాయింట్లు (0.60శాతం) నష్టపోయి 26,534 వద్ద ముగిసింది. ఐటీ ఇండెక్స్‌ మాత్రం 0.10 శాతం స్వల్పలాభంతో ముగిసింది.
వేదాంత, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, టాటాస్టీల్‌, హిందాల్కో, సన్‌ఫార్మా షేర్లు 4నుంచి 6శాతం నష్టపోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, ఇన్ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందూస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి.



You may be interested

రక్షణాత్మక ధోరణి అవసరం, సాహసోపేత నిర్ణయాలు వద్దు..!

Wednesday 5th December 2018

బసంత్ మహేశ్వరి వెల్త్‌ అడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ సూచన ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ప్రస్తుతం మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను నిర్వహిస్తున్నారని ప్రముఖ మనీ మేనేజర్ బసంత్ మహేశ్వరి వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా చూస్తే.. ఇన్వెస్టర్లు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం కంటే రక్షణాత్మక ధోరణిని అవలంభించడం మంచిదని సూచించారు. గడిచిన 45- 60 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఇదే విషయం

ప్రతి 3లో 2 షేర్లకు టార్గెట్‌ డౌన్‌గ్రేడ్‌

Wednesday 5th December 2018

ముంబై: నవంబర్‌లో నిఫ్టీ 50 ఇండెక్స్‌ 4.7 శాతం లాభపడింది. దేశీ మార్కెట్లు గతనెలలో ఏకంగా 891 మిలియన్‌ డాలర్ల విదేశీ నిధులను ఆకర్షించాయి. ఇదే నెలలో ముడిచమురు ధర 20 శాతం పతనమవగా డాలరుతో రూపాయి మారకం విలువ 4.4 శాతం బలపడింది. ఇంతటి సానుకూల అంశాలలో సైతం అనలిస్టులు తామ కవరేజ్‌లో ఉన్నటువంటి 67.6 శాతం షేర్లను డౌన్‌గ్రేడ్‌ చేశారు. ప్రతి 3 షేర్లలో 2 షేర్ల

Most from this category