STOCKS

News


నష్టాల ప్రారంభం

Friday 15th February 2019
Markets_main1550203836.png-24205

ప్రపంచమార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం మరోసారి నష్టాలతో ప్రారంభమైంది. ఇటీవల మార్కెట్లో నెలకొన్న అస్థితర వాతావరణ సూచీల ట్రేడింగ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రూపాయి పతనంతో ఐటీ షేర్ల తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అ‍త్యధికంగా ఫార్మా షేర్లలో విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంక్‌, అటో షేర్ల సైతం నష్టాల బాట పట్టాయి. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 65 పాయింట్ల నష్టంతో 35,811 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 10,722 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక ప్రపంచమార్కెట్ల విషయానికొస్తే.. గురువారం యూరప్‌ మార్కెట్లతో పాటు రాత్రి అమెరికా మార్కెట్లు సైతం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియాలోని పలు ప్రధాన మార్కెట్లు నష్టాల ట్రేడింగ్‌ దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఇక ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్షీణత కొనసాగుతుంది. వరుసగా 3వ రోజూ నష్టాలతో ప్రారంభమైంది. గత ట్రేడింగ్‌లో 36 పైసలు నష్టపోయిన 71.16 వద్ద ముగిసిన రూపాయి నేడు మరో 7పైసల నష్టంతో 71.23 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  

టైటాన్‌, టాటామోటర్స్‌, వేదాంత, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టపోగా, గెయిల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ షేర్లు 1శాతం నుంచి 3.50శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 15th February 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు జెట్ ఎయిర్‌వేస్‌:- ఆర్థిక క‌ష్టాల సుడిగుండం నుంచి గట్టెక్కేందుకు ప్రోవిజ‌న‌ల్ రెల్యూష‌న్ ప్రణాళికకు బోర్డు ఆమోదం తెలిపింది. ప్రణాళిక‌లో భాగంగా కంపెనీ రుణాలను ఈక్విటీ షేర్ల కింద మార్చనుంది.   మిండా ఇండ‌స్ట్రీస్‌:- హ‌రిత సీటింగ్ సిస్టమ్ లిమిటెడ్ విలీనాన్ని ఆమోదం తెలిపింది. 100 షేర్లు కలిగిన హ‌రిత సీటింగ్ సిస్టమ్ లిమిటెడ్ షేర్‌హోల్డర్లకు విలీన ప్రక్రియతో 152 మిండా షేర్లు లభించనున్నాయి.

షేర్లు ఇంతలా పడిపోవడానికి కారణం అదేనా...?

Friday 15th February 2019

ప్రధాన సూచీలు ఓ పరిమిత శ్రేణిలోనే ప్రయాణం సాగిస్తుంటే... మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు ప్రతీ రోజూ నేల చూపులు చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు నూతన కనిష్ట స్థాయిలను నమోదు చేస్తున్నాయి. ఈ పతనం ఎంతవరకు...? అన్న భయం రిటైల్‌ ఇన్వెస్టర్లలో నెలకొంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ చాలా ఆకర్షణీయ ధరలకు వచ్చేశాయని, వీటిల్లో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చంటూ పలువురు విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థలు సూచిస్తున్నాయి. మరి ఎందుకని ఈ

Most from this category